కేసీఆర్ మీరు నిజమే చెప్పారు: రాహుల్ గాంధీ

Published : Nov 29, 2018, 04:30 PM IST
కేసీఆర్ మీరు నిజమే చెప్పారు: రాహుల్ గాంధీ

సారాంశం

ఈ ఎన్నికల్లో ఓడిపోతే తనకేం నష్టం లేదని వెళ్లి ఫాం హౌస్ లో నిద్రపోతానని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్మూర్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ స్పందించారు. కేసీఆర్ నిజమే చెప్పారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఫాం హౌస్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారని అది వాస్తవమన్నారు. 

ఆర్మూర్: ఈ ఎన్నికల్లో ఓడిపోతే తనకేం నష్టం లేదని వెళ్లి ఫాం హౌస్ లో నిద్రపోతానని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్మూర్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ స్పందించారు. కేసీఆర్ నిజమే చెప్పారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఫాం హౌస్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారని అది వాస్తవమన్నారు. 

అయితే కేసీఆర్ విశ్రాంతి తీసుకునేది రూ.300కోట్లతో నిర్మించిన భవంతిలోనని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు కానీ ఒక్కరికి కూడా ఇళ్లు ఇవ్వలేదు మీరు మాత్రం వందల కోట్లతో ఇళ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. 

నిరుపేదలకు భూములు ఇస్తానని హామీ ఇచ్చారు ఒక్కరికి కూడా ఇవ్వకుండా మీరు మాత్రం 300కోట్ల రూపాయలతో భవనం నిర్మించుకుంటారా అంటూ నిలదీశారు రాహుల్ గాంధీ.  దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టీరిని తెరిపించేందుకు 100 కోట్లు అవసరమైతే రూపాయి ఇవ్వలేదు కానీ 100లకోట్లతో భవంతులు నిర్మించుకుంటారా అంటూ రాహుల్ నిలదీశారు. 
 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu