ఇకపై చిన్నారులను లైంగికంగా వేధిస్తే ‘డిజిటల్ రేప్’ కేసే.. పోక్సో కేసులపై పోలీసుల పరిశీలన..

By Bukka Sumabala  |  First Published Sep 6, 2022, 8:05 AM IST

చిన్నారులను అసభ్యంగా తాకినా, లైంగికంగా వేధించినా.. డిజిటప్ రేప్ కేసులుగా  పరిశీలించి, కోర్టులకు అభియోగపత్రాలు సమర్పించాలని హైదరాబాద్ పోలీసులు తెలుపుతున్నారు. 


హైదరాబాద్ : చిన్నారులను లైంగికంగా వేధించిన దుర్మార్గుల ఆటలు ఇకపై చెల్లవు. పిల్లలను హత్తుకున్నా, వారి దుస్తులు తీసేసినా డిజిటల్ రేప్ గా కోర్టులు పరిగణిస్తాయి. అత్యాచార నేరానికి ఎలాంటి శిక్షలు ఉంటాయో.. అలాంటివే విధిస్తున్నాయి. మూడున్నర ఏళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన అక్బర్ అలీ (65)కి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని సూరజ్ పూర్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అనిల్ కుమార్ సింగ్ ఇటీవల తీర్పు ఇచ్చారు. పశ్చిమబంగలోని మాల్దాకు చెందిన అక్బర్ ఆలీ నోయిడాలోని తన కుమార్తె ఇంటికి మూడేళ్ల కిందట వెళ్ళాడు. ఆ ఇంటి పక్కనే ఉన్న చిన్నారిని లైంగికంగా వేధించాడు. 

నోయిడా పోలీస్ లు కేసు నమోదు చేసి అక్బర్ అలీని అరెస్టు చేశారు. సూరజ్ పూర్ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ కొనసాగింది. రెండు రోజుల క్రితం సాక్ష్యాధారాలను జడ్జి అనిల్ కుమార్ సింగ్ పరిశీలించారు. ‘అది డిజిటల్ రేప్ గా పరిగణించి యావజ్జీవ శిక్ష విధించారు. ఈ నేపథ్యంలో చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న వారిపై నమోదు చేసిన కేసులను సునిశితంగా పరిశీలించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. నిందితులకు యావజ్జీవ శిక్షలు పడేలా కోర్టులకు అభియోగపత్రాలు సమర్పించనున్నారు.

Latest Videos

undefined

వర్ధన్నపేట గిరిజన బాలికల హస్టల్ లో పుడ్ పాయిజన్: 40 మంది విద్యార్ధినులకు అస్వస్థత

‘డిజిటల్ రేప్’ అంటే..
చిన్నారులను లైంగికంగా వేధించినా.. వారి రహస్యాంగాల్లో వేళ్లు, ఇతర వస్తువులు ఉంచినా.. అది డిజిటల్ రేప్ కిందికి వస్తుందని నిర్భయ చట్టం చెబుతోంది. ఈ చట్టం ప్రకారం నిందితులకు పోక్సో చట్టంతో పాటు ipc 375,  376 సెక్షన్ ప్రకారం యావజ్జీవ ఖైదు విధించవచ్చు. ‘డిజిటల్ రేప్’ అంటే సైబర్ నేరాలు కాదని, డిజిటల్ అంటే ఆంగ్లంలో వేళ్లు అన్న అర్థం వస్తుందని, అందుకే చిన్నారిని లైంగికంగా వేధించిన అక్బర్ అలీ(65)కి యావజ్జీవ కఠిన కారాగార  శిక్ష విధిస్తున్నట్లు సెషన్స్ జడ్జి అనిల్ కుమార్ సింగ్ తన తీర్పులో వివరించారు.

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

చాక్లెట్లు, బిస్కెట్లు ఆశపెట్టి.. బెదిరింపులు పాల్పడి ..
చిన్నారులు, బాలురు, బాలికను లక్ష్యంగా చేసుకుని కామాంధులు వారి లైంగిక కోర్కెలను తీర్చుకుంటున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి వారి తల్లిదండ్రులు లేని సమయంలో శరీర భాగాలను తాగుతున్నారు. అపరిచితులు, బంధువులతో పాటు ఎవరైనా ఎత్తుకున్నా, శరీర భాగాలను తాకినా.. పిల్లలకు తెలియడం లేదు. కౌమార దశలోని బాలికలకూ మంచి, చెడు స్పర్శలను తల్లిదండ్రులు చెప్పడం లేదు. దీంతో వీరిపై కన్నేసిన కామాంధులు మొబైల్ ఫోన్ లో గేమ్ లు ఆడండి అంటూ పిలిచి గదుల్లోకి తీసుకెళ్తున్నారు. వారు ఆటలో లీనమైనప్పుడు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మరికొందరు పిల్లలకు అశ్లీల వీడియోలు, అసభ్యకరమైన ఫోటోలు చూపించి బలాత్కారం చేస్తున్నారు. గ్రేటర్ లోని మూడు కమిషనరేట్లో ఇలాంటివి ఏటా 120 నుంచి 150 కేసులు నమోదవుతున్నాయి.

click me!