బోండా బజ్జీ ఇస్తానని ఆశచూపి.. ఆరేళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు రేప్.. హైదరాబాద్ కోర్టు తీర్పు ఇదే

By Mahesh KFirst Published Jan 20, 2022, 7:59 PM IST
Highlights

హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్‌లో ఆరేళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2020 జనవరి 30వ తేదీన ఆరేళ్ల బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా, వృద్ధుడు షేక్ హైదర్ పంజా విసిరాడు. పక్కా ప్లాన్‌తో ఆమెకు బోండా బజ్జీలు ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా, ఈ కేసు విచారణలో వృద్ధుడిని దోషిగా తేల్చి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 1000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 2 లక్షల పరిహారం అందించాలని తీర్పు ఇచ్చింది.
 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో గతేడాది ఘోరం జరిగింది. బోండా(Bonda Bajji)లు ఇస్తానని నమ్మించి ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను 75 ఏళ్ల వృద్ధుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆపై ఆ బాలికపై అఘాయిత్యానికి(Sexual Assault) పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెంటనే నేరెడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా, ఈ కేసులో ఎల్బీ నగర్‌లోని ఎంఎస్‌జే కోర్టు తీర్పు వెలువరించింది. వృద్ధుడిని దోషిగా తేల్చి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష(Imprison) విధించింది. రూ. 1000 జరిమానా వేసింది. అంతేకాదు, బాధితురాలికి రూ. 2 లక్షల నష్ట పరిహారం అందించాలని తీర్పు చెప్పింది.

2020 జనవరి 30వ తేదీన సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో నేరెడ్‌మెట్‌లో ఆరేళ్ల బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటున్నది. ఇది గమనించిన అదే ఏరియాకు చెందిన 75 ఏళ్ల షేక్ హైదర్ చిన్నారి అని కూడా చూడకుంటా మనసులో కుట్ర పథకం పన్నాడు. ఆ బాలిక దగ్గరకు వెళ్లి తమ ఇంటికి వస్తే.. బోండా బజ్జీ ఇస్తానని ఆశ చూపాడు. ఆ బాలిక సరే అని వృద్ధుడి ఇంటికి దోషితోపాటు వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లాక ఆ వృద్ధుడు బాలికపై అఘాయిత్యానికి(Rape) పాల్పడ్డాడు. బాలిక తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత 28 ఏళ్ల తల్లి బిడ్డ ప్రవర్తనలో తేడాను గుర్తించింది. 

అనంతరం ఆమె నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్‌లో ఆ వృద్ధుడిపై ఫిర్యాదు చేసింది. అభం శుభం తెలియని తన కూతురుపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. స్టేషన్ ఇన్‌చార్జ్ ఆఫీసర్ ఏ నర్సింహా స్వామి ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత నిందితుడు షేక్ హైదర్‌ను అరెస్టు చేశాడరు. ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి రిమాండ్‌కు పంపారు. కాగా, దర్యాప్తు పూర్తి అయిన తర్వాత పోలీసు అధికారి చార్జిషీటు దాఖలు చేశారు. 

ఈ కేసును ఎల్బీ నగర్‌లోని ఎంఎస్‌జే కోర్టులో న్యాయమూర్తి ఆర్ తిరుపతి విచారించారు. ఈ నెల 20వ తేదీన నిందితుడు షేక్ హైదర్ దోషిగా అని నిర్ధారణ చేశారు. అనంతరం, షేక్ హైదర్‌కు ఐదేళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. రూ. 1000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ. 2,00,000 పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు రాచకొండ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇదిలా ఉండగా,  National highwaysపై ప్రయాణించే womenలకు కిడ్నాప్ చేసి gang rapeలకు పాల్పడే  కిరాతక ముఠాను రాజస్థాన్లోని ప్రతాప్ గఢ్ జిల్లా పోలీసులు arrest చేశారు.  ఈ ముఠాలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి కొన్ని Pornographic videosను స్వాధీనం చేసుకున్నారు. 15 రోజులకు ఒకసారి హైవేలపై ఇలాంటి నేరాలకు ఈ ముఠా  తెగబడేదని పోలీసులు తెలిపారు. వీరంతా వరుస గ్యాంగ్ రేప్ లకు పాల్పడినట్లు  వీడియో లనుబట్టి తెలుస్తోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఎనిమిది మందితో కూడిన ఈ ముఠాలో ఎక్కువమంది 20 ఏళ్ల వయస్సు కలిగిన వారేనని.. వీరంతా Robbery, kidnappingలకు పాల్పడుతున్నారని ప్రతాప్ గఢ్ జిల్లా ఎస్పీ అమృతా దుహాన్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో minor కూడా  ఉన్నట్లు ఆమె తెలిపారు. పలువురు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సమయంలో తీసిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

click me!