ట్రాన్స్‌వుమెన్‌తో ఫ్రీ సెక్స్‌ కోసం గొడవ.. ఒకరు మృతి.. నార్సింగిలో ఘటన

By team teluguFirst Published Jan 7, 2023, 12:36 PM IST
Highlights

ట్రాన్స్‌వుమెన్‌తో సెక్స్ కోసం జరిగిన గొడవలో ఒకరి ప్రాణంపోయింది. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులు మరుసటి రోజు ఇద్దరు కానిస్టేబుళ్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. 

ట్రాన్స్‌వుమెన్‌తో ఫ్రీ కోసం జరిగిన ఓ గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగిలోని మంచిరేవుల గ్రామంలో బుధవారం రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు  గురువారం జగత్‌గిరిగుట్ట వద్ద ఇద్దరు సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) కానిస్టేబుళ్లపై కూడా కత్తితో దాడి చేశారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు పోలీసు కస్టడీలో ఉన్నారని వర్గాలు తెలిపాయి. కానీ అధికారులు దీనిని ధృవీకరించలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం నివేదించింది.ౌ

అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అంటున్న సీతక్క కుమారుడు.. ఎక్కడి నుంచి అంటే..?

నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి డయల్ 100కు కాల్ వచ్చింది. ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురైనట్లు అందులో తెలిపారు. దీంతో పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో అక్కడ ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడికి వెళ్లే సరికే బాధితుడు చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. మృతుడిని హైదర్షాకోట్ కు చెందిన కిషోర్ రెడ్డిగా గుర్తించారు.

హైదరాబాద్‌లో సీబీఐ సోదాల కలకలం.. ప్రముఖ డాక్టర్ ఇంట్లో అధికారుల తనిఖీలు..

బుధవారం రాత్రి కిశోర్ రెడ్డి భార్య నిహారిక అలియాస్ నరేష్ అనే ట్రాన్స్ జెండర్ ను బుధవారం రాత్రి సమయంలో ఇద్దరు నిందితులు కత్తితో బెదిరించారు. ఆమెను తమతో సెక్స్ లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె కిశోర్ రెడ్డికి కాల్ చేసి విషయం చెప్పింది. దీంతో అక్కడికి అతడు చేరుకున్నాడు. కానీ ఆలోపే అటుగా వచ్చిన పెట్రోలింగ్ వాహనాన్ని చూసి నిందితులు పారిపోయారు. అనంతరం కిశోర్ తన స్నేహితుడు శివరాజ్ తో కలిసి నిందితులను కనిపెట్టాడు. అక్కడి వెళ్లి వారితో గొడవపడ్డాడు. క్రమంలో నిందితుల్లో ఒకరైన కరణ్ సింగ్ కిశోర్ ను పొడిచి చంపాడు. శివకు కూడా గాయాలయ్యాయి. 

మరో యువకుడితో ఫోటోలు షేర్ చేసిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య..!

అనంతరం నిందితులు ఇద్దరు తమ వాహనాన్ని అక్కడే వదిలేపి శివ బైక్ పై పారిపోయారు. ఆ తర్వాత వారు తులసీ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.15 వేలు దోచుకెళ్లారు. తెల్లవారుజామున 2.30 నుంచి 3.30 గంటల మధ్య ఇదంతా జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు జగత్గిరిగుట్టలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ కేసును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో మఫ్తీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు రాజు, విజయ్ లు నిందితులను సమీపించినప్పుడు వారు రాళ్లతో దాడి చేశారు. దీంతో వారికి గాయాలు అయ్యాయి. 

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై హైకోర్టును ఆశ్రయించిన రైతులు.. రిట్ పిటిషన్ దాఖలు..

ఇందులో రాజు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఇద్దరు కానిస్టేబుళ్లు చికిత్స పొందుతున్నారని బాలానగర్ డీసీపీ జి.సందీప్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు హత్య, దోపిడీ ఆరోపణలపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసినందుకు జగత్గిరిగుట్ట పోలీసులు హత్యాయత్నంపై మూడో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 

click me!