బాండ్ రాసి 1000 రోజులైంది... రాజీనామా చేయ్: ఎంపీ అరవింద్‌కు పసుపు రైతుల నుంచి నిరసన సెగ

By Siva KodatiFirst Published Sep 21, 2021, 3:32 PM IST
Highlights

బీజేపీ ఎంపీ అరవింద్ రాసిచ్చిన బాండ్‌కు 1000 రోజులు గడిచాయని.. వెంటనే రాజీనామా చేసి పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించాలని రైతులు కోరారు. గ్రామంలో పోటాపోటీ నిరసనలతో రాజకీయం వేడెక్కింది. ఈ నిరసనలతో పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం తల్వేద గ్రామంలో పోటాపోటీ ఆందోళనలు జరుగుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుండగా.. గ్రామాభివృద్ధి కార్యాలయం ఎదుట పసుపు రైతులు మంగళవారం నిరసన చేపట్టారు.

గత కొన్ని రోజులుగా తల్వేద పంచాయతీ కార్యాలయం ఎదుట అర్హులైన వారికి డబుల్ ఇండ్లు ఇవ్వాలని పార్టీలకు అతీతంగా గ్రామస్తులు మన ఊరు-మన బాధ్యత అనే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఈ నిరసన వెనుక బీజేపీ నేతలు వున్నారంటూ టీఆర్ఎస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తల్వేద గ్రామాభివృద్ధి కమిటీ కార్యాలయం ఎదుట పసుపు రైతులు నిరసన దీక్షకు కూర్చున్నారు. ఈ నిరసన దీక్షకు టీఆర్ఎస్ మద్దతు పలికింది.

click me!