స్విగ్గీ డెలివరీ పేరుతో డ్రగ్స్ పంపిణీ

By telugu news teamFirst Published Nov 20, 2020, 1:49 PM IST
Highlights


  కెనడాలో ఉద్యోగం మానేసి హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. దూల్‌పేట్ డ్రగ్ పెడ్లర్‌తో బాలాజీ సింగ్‌కు సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా రోజు రోజుకీ పెరుగిపోతోంది. స్విగ్గీ డెలివరీ పేరుతో డ్రగ్స్ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గంజాయి సరఫరా చేస్తున్న బాలాజీ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కెనడాలో ఎంఎస్ చేసిన బాలాజీ సింగ్.. డ్రగ్స్‌కు బానిసయ్యాడు. 

  కెనడాలో ఉద్యోగం మానేసి హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. దూల్‌పేట్ డ్రగ్ పెడ్లర్‌తో బాలాజీ సింగ్‌కు సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు బాలాజీ సింగ్‌ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల నగరంలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఓ ముఠా  నగరంలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా.. వ్యభిచారం కూడా యదేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు తెలస్తోంది. ఆన్ లైన్ లో  డ్రగ్స్ తోపాటు.. వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యి.. సదరు ముఠాను అరెస్టు చేశారు. విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగు చూశాయి.

గోవా, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సదరు యువతుల ద్వారా విటులు, ఇతరులకు ఈ ముఠా డ్రగ్స్ సప్లై చేస్తోంది. తాజాగా అదుపులోకి తీసుకున్న ముఠా వద్ద నుంచి  200 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఒక నైజీరియన్ నుంచి సమాచారం అందడంలో పోలీసులు ఈ దాడులు జరిపినట్లు సమాచారం.  ఈ ముఠా ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్‌ను ఇక్కడికి తెచ్చి..  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల హస్తం కూడా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

click me!