దిశా కేసు : లారీ ఓనర్ పై అనుమానం.. వెలుగులోకి కొత్త ట్విస్ట్...

By AN TeluguFirst Published Feb 10, 2021, 3:07 PM IST
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 2019 చివర్లో హైదరాబాద్ శివార్లలో నలుగురు యువకులు ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 2019 చివర్లో హైదరాబాద్ శివార్లలో నలుగురు యువకులు ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఈ దిశా కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో అందరూ ఈ కేసును మరిచిపోయారు. ఈ ఘటన జరిగి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఇన్ని రోజుల తరువాత ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 

ఎన్ కౌంటర్ లో మరణించిన నిందితుల కుటుంబ సభ్యలు దిశ కమిషన్ ను ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని చెబుతూ సంచలన ఆరోపణలు చేశారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా కొందరు ప్రలోభ పెడుతున్నారని.. అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు కుటుంబ సభ్యులు దిశ కమిషన్ కు తెలిపారు. 

ఆ తర్వాత ఓ మీడియా సంస్థతో మాట్లాడిన మృతుల కుటుంబ సభ్యులు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య యాక్సిడెంట్ కేసులో అనుమానాలున్నాయన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కుర్మయ్యను యాక్సిడెంట్ లో హత్య చేశారని ఆరోపించారు. 

దిశా అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటపెడతామని పేర్కొన్నారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకుంటే రూ.25 లక్షలు ఇస్తామని కొందరు ప్రలోభ పెడుతున్నట్లుగా వివరించారు. తమకు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిపై అనుమానం ఉందని, ఆయన్ని విచారించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

నవంబర్ 27న పశువైద్యురాలు దిశపై శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ తరువాత ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి.. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగులబెట్టారు. 

ఈ ఘటన మీద దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు రోజుల తర్వాత దిశ హత్యాచారం కేసులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అరెస్ట్ అయ్యారు. డిసెంబర్ 6న జరిగిన ఎన్ కౌంటర్ లో ఈ నలుగురు చనిపోయారు. 

విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో పోలీసులపై దాడి చేయడంతో.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. 

దీనిపై కేసు నమోదు కావడంతో అంత్యక్రియలు 17 రోజులు ఆలస్యమయ్యాయి. డిసెంబర్ 6న ఎన్ కౌంటర్ జరిగితే.. డిసెంబరు 23న నలుగురు నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు. వీళ్ల అంత్యక్రియలు జరిగిన మూడు రోజులకు చెన్న కేశవులు తండ్రి కుర్మయ్య రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. 

click me!