ఇబ్రహింపుర్ అభివృద్ది చూసి ఫిదా అయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు (వీడియో)

Dec 21, 2018, 9:58 AM IST

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఎఎస్  అధికారులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ది, పర్యావరణ హితమైన పనులను చూసిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృదం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యే నిబద్దతలో పనిచేస్తే ఎలాంటి మార్పులుంటాయో హరీష్ ను, ఆయన నియోజకవర్గాన్ని చూస్తే అర్థమవుతోందని ఈ బృందం అభిప్రాయపడింది.