కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక: ముహూర్తమిదీ...

By narsimha lodeFirst Published Sep 26, 2018, 3:32 PM IST
Highlights

మాజీ మంత్రి, టీఆర్ఎష్ ఎంపీ డి.శ్రీనివాస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అక్టోబర్  మాసంలో  డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఎఐసీసీ వర్గాలు ధృవీకరించాయి.

హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అక్టోబర్  మాసంలో డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఎఐసీసీ వర్గాలు ధృవీకరించాయి.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో డీ.శ్రీనివాస్‌పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు  సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై  డి.శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తిని కూడ వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు తనను పార్టీ నుండి సస్పెండ్  చేయాలని కూడ డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానంపై  అసహానాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో తనకు సరైన గుర్తింపు లేని కారణంగా  డి.శ్రీనివాస్ తిరిగి  కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

దేవీనవరాత్రుల సందర్భంగా డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  ఈ సమయంలోనే  రాహుల్‌ గాంధీ  సమయం ఆధారంగా  కాంగ్రెస్ పార్టీలో డి.శ్రీనివాస్ చేరనున్నారు.  ఈ మేరకు ఇవాళ ఎఐసీసీ వర్గాలు కూడ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో  చేరుతారనే విషయాన్ని ధృవీకరించారు. 

 

సంబంధిత వార్తలు

భూపతిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

ఉప్పల్ కాంగ్రెస్‌లో చిచ్చు: అనుచరులతో రాజిరెడ్డి భేటీ, టీఆర్‌ఎస్‌లోకి

రాజకీయాల నుండి తప్పుకొంటా: ఎర్రబల్లి దయాకర్ రావు సంచలనం

సబితాను కలిసిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరుతా: కేఎస్ రత్నం

టీఆర్ఎస్‌కు షాక్: ఉత్తమ్‌తో కేఎస్ రత్నం మంతనాలు, త్వరలోనే కాంగ్రెస్‌లోకి

నందీశ్వర్‌గౌడ్, కేఎస్ రత్నంలకు కాంగ్రెస్ సీనియర్ల షాక్

click me!