కాంగ్రెస్-సీపీఐ బేరం కుదిరింది: మూడు సీట్లకు ఓకే చెప్పిన కామ్రేడ్లు

By sivanagaprasad kodatiFirst Published Nov 13, 2018, 10:11 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య బేరం కుదిరింది. మూడు సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరిస్తున్నట్లుగా సీపీఐ తెలిపింది. 

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య బేరం కుదిరింది. మూడు సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరిస్తున్నట్లుగా సీపీఐ తెలిపింది. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కొత్తగూడెం స్థానం ఉండటంతో కామ్రేడ్లు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

కాంగ్రెస్ వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన సీపీఐ రాష్ట్ర కమిటీ.. తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది. కూటమిలో ఉండటమా లేదంటే బయటకు రావడమా అన్న దానిపై ఉదయం 11 గంటలకు సమావేశం అవ్వాలని నిర్ణయించింది.

అయితే దీనిపై కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి కామ్రేడ్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ చర్చలు ఫలించి మూడు సీట్లతో పాటు రెండు ఎమ్మెల్సీలకు సీపీఐ అంగీకారం తెలపడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

ఈ పొత్తును భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీనిపై సీపీఐ ఇవాళ అధికారికంగా ప్రకటన చేయనుంది. హుస్నాబాద్‌లో చాడ వెంకటరెడ్డి, వైరాలో విజయ పోటీ పేర్లు ఖరారవ్వగా.. బెల్లంపల్లిలో ఎవరినీ నిలపాలన్న దానిపై సమాలోచనలు జరపునుంది. 

కొత్తగూడెం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్...సీపీఐ తాడోపేడో

సీట్ల లొల్లి: ఢిల్లీకి సీపీఐ నేతలు, కాంగ్రెస్ తేల్చేనా?

సీట్ల లొల్లి: చాడతో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రీనివాసన్ భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: దిక్కుతోచని స్థితిలో సీపీఐ

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

click me!