బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో తెలంగాణ (Telangana) లోని ఆలయాల అభివృద్ధి జరిగిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Malla reddy)అన్నారు. 56 ఏండ్ల కాంగ్రెస్ (congress) పాలనలో దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసిందేమీ లేదని చెప్పారు. శనివారం ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని (Kondagattu Anjaneya Swamy Temple) దర్శించుకున్నారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని దుయ్యబట్టారు. శనివారం ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు.
బీజేపీ స్థాపనలో, జాతీయ స్థాయికి చేర్చడంలో అద్వానీది కీలక పాత్ర..
మాజీ సీఎం కేసీఆర్ తోనే తెలంగాణలోని రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లాయని, కానీ కొండగట్టు అంజన్నను ఎవరు పట్టించుకోలేదని అన్నారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆలయ అభివృద్ధికి 500 కోట్లు ప్రకటించిందని అన్నారు. కోనేరుతో పాటు పలు అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద అంజన్న గుడి మన కొండగట్టులోనే ఉందని అన్నారు.
భారతరత్న ఎవరికి ఇస్తారు..? ఎందుకు ఇస్తారు ? అర్హతలేంటి ?
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు గెలవాలని కొండగట్టు అంజన్నకు మొక్కుకున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని ఆయన దుయ్యబట్టారు. 56 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పరిపాలించిందని, కానీ ఏనాడూ రాష్ట్రానికి అన్యాయం చేయలేదని అన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 రోజుల పాలనలో 50 రకాల వేషాలు వేసిందని విమర్శించారు. ముందు కూడా ఏమీ జరగదని, అది అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు.
బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య రాజీనామా..
ఇదిలా ఉండగా.. మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. మల్లారెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, చిన్నప్పుడు ఆయనను బర్రె కరించిందేమో అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని సూచించారు. శనివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. స్కూల్స్, కాలేజీలు కట్టి ఫీజులను దోచుకుంటూ మల్లారెడ్డి రాజకీయాలను కొనుగోలు చేస్తున్నారని బండ్ల గణేష్ విమర్శించారు.
భర్త శాడిజం.. 12 ఏళ్లుగా ఇంట్లోనే భార్య బందీ.. కిటికీ ద్వారానే పిల్లల బాగోగులు..
సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తున్నారని, ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవం ఇవ్వాలని, స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని అన్నారు. మల్లారెడ్డిని దున్నపోతు అంటూ అభివర్ణించారు. గోవాలో హోటల్ గానీ, క్యాషినో గానీ ఏదైనా పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తండ్రి, తాతలు వచ్చిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని తెలిపారు. రేవంత్ రెడ్డిని ఎవరూ ముట్టుకోలేరని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత పాలన అందిస్తోందని, త్వరలోనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి రోజుకు 20 గంటలు పని చేస్తున్నారని అన్నారు.