ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్: రంగంలోకి నందిని, కాంగ్రెస్‌లో పోటాపోటీ

By narsimha lodeFirst Published Feb 3, 2024, 12:28 PM IST
Highlights

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  పోటీకి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు  రంగం సిద్దం చేసుకుంటున్నారు.

హైదరాబాద్: ఖమ్మం పార్లమెంట్  స్థానం నుండి  పోటీ చేసేందుకు  కాంగ్రెస్ పార్టీ తరపున నేతల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.తెలంగాణ రాష్ట్రం నుండి సోనియాగాంధీని పోటీ చేయాలని  పీసీసీ  తీర్మానం చేసింది.ఈ మేరకు ఈ తీర్మానాన్ని సోనియా గాంధీకి కూడ  తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందించారు. 

తెలంగాణ నుండి సోనియా గాంధీ  పోటీ చేస్తే ఆ స్థానం ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది.  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం  పార్లమెంట్ స్థానం నుండి  సోనియా గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది.

also read:తాటిచెట్లకు తాళాలు: కల్లుగీత కార్మికుల వినూత్న ఆలోచన, ఎందుకంటే?

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుండి సోనియా గాంధీ పోటీ చేయకపోతే  తమకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు  పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.ఈ మేరకు  ధరఖాస్తులు చేసుకుంటున్నారు.  గతంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  రేణుకా చౌదరి  ప్రాతినిథ్యం వహించారు.  మరోసారి తాను కూడ ఇదే స్థానం నుండి పోటీకి ఆమె రంగం సిద్దం చేసుకుంటున్నారు.  సోనియా గాంధీ పోటీ చేయకపోతే తాను బరిలోకి దిగుతానని ఇటీవల మీడియా సమావేశంలో రేణుకా చౌదరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

also read:కుమారీ ఆంటీపై డీజే సాంగ్: సోషల్ మీడియాలో వైరల్

తాజాగా  ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీకి తెలంగాణ డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడ సిద్దమయ్యారు. ఇవాళ  ఖమ్మం నుండి  ర్యాలీగా ఆమె హైద్రాబాద్ గాంధీ భవన్ కు బయలు దేరారు.ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు  మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడ ధరఖాస్తు చేసుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ  టిక్కెట్టు  టిక్కెట్టు ఎవరికి దక్కినా వారి గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని నందిని చెప్పారు. 

also read:రెండు స్థానాల నుండి అధికారం వరకు: బీజేపీ విస్తరణలో అద్వానీదే కీలకపాత్ర

తెలంగాణ రాష్ట్రంలో  పార్లమెంట్ ఎన్నికలను  కాంగ్రెస్ పార్టీ  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని 19 పార్లమెంట్ స్థానాలున్నాయి.ఈ 17 స్థానాల్లో  మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది.ఈ మేరకు ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా మంత్రులను ఆ పార్టీ నియమించింది.  

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి అసెంబ్లీ ఎన్నికల ముందు  ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హమీలను అమలు  చేయనున్నట్టుగా ప్రకటించింది.ఈ నెల
 

click me!