బీజేపీ స్థాపనలో, జాతీయ స్థాయికి చేర్చడంలో అద్వానీది కీలక పాత్ర..
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పొందిన ఎల్ కే అద్వానీ (L.K. Advani, who received the country's highest civilian award Bharat Ratna).. బీజేపీ (Formation of BJP)ని స్థాపించడంలో, దానిని జాతీయ స్థాయి (national level)కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఉప ప్రధానిగా (deputy prime minister of india), కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందించారు.
బీజేపీ సీనియర్ నాయకుడ, మాజీ ఉప ప్రధానికి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు పుర్కస్కారం ప్రదానం చేయబోతున్నట్టు ప్రకటించింది. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా భారత అత్యున్నత పౌర పురస్కారం అందించి సత్కరించనుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అధికారింగా ప్రకటించారు.
నాలుగు రోజుల కిందటే ఇంట్లో డ్రాప్ చేశా.. మరణంలో ఏదో మిస్టరీ ఉంది - పూనమ్ బాడీగార్డ్
ఎవరీ అద్వానీ..
అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయనను అందరూ ఎల్ కే అద్వానీ అని పిలుస్టుంటారు. భారతదేశంలో సుదీర్ఘమైన, ప్రభావవంతమైన రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న నాయకుల్లో ఆయన అగ్ర వరుసలలో ఉంటారు. ఆయన 1927 నవంబర్ 8న విభజనకు ముందు సింధ్ లో జన్మించారు. విభజన తర్వాత 1947లో అద్వానీ ఢిల్లీకి వలస వెళ్లారు.
భారతరత్న ఎవరికి ఇస్తారు..? ఎందుకు ఇస్తారు ? అర్హతలేంటి ?
1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ లో ఆయన చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1970లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1972 డిసెంబరులో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1975లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న జనతా పార్టీలో అద్వానీ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా సేవలు అందించారు. తరువాత 1980లో అటల్ బిహారీ వాజ్ పేయితో కలిసి బీజేపీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.
భర్త శాడిజం.. 12 ఏళ్లుగా ఇంట్లోనే భార్య బందీ.. కిటికీ ద్వారానే పిల్లల బాగోగులు..
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో మందిర నిర్మాణం కోసం 1990వ దశకంలో రామజన్మభూమి ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించి ప్రాముఖ్యతను పొందారు. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డీఎ) పాలనలో అద్వానీ ఉపప్రధానిగా, హోం మంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు.
బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు (1998, 1999) కేంద్ర హోం మంత్రిగా నియమితులైన అద్వానీ 2002లో ఉపప్రధానిగా దేశానికి సేవలు అందించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష నేతగా పని చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీ తన పార్టీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ సమయంలో బీజేపీ ఓడిపోయింది. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో కొంత కాలం నుంచి యాక్టివ్ రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు.