కుమారీ ఆంటీపై డీజే సాంగ్: సోషల్ మీడియాలో వైరల్

By narsimha lode  |  First Published Feb 3, 2024, 10:39 AM IST

హైద్రాబాద్ లో ఫుడ్ బిజినెస్ చేసే కుమారీ ఆంటీ  మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు.


హైదరాబాద్: కుమారీ ఆంటీ  ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందారు.  సోషల్ మీడియాలో ప్రచారం కారణంగా కుమారీ ఆంటీకి చెందిన ఫుడ్ బిజినెస్ కు కూడా గిరాకీ వస్తుంది. ఈ విషయాన్ని  కుమారీ ఆంటీ స్వయంగా మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పారు. 

also read:కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్: రాజకీయ రచ్చ, టీడీపీ -జనసేనపై వైఎస్ఆర్‌సీపీ ఫైర్

Latest Videos

undefined

అయితే  కుమారీ ఆంటీకి చెందిన  ఫుడ్ బిజినెస్ ను ఇటీవల హైద్రాబాద్ పోలీసులు  మూసివేయించారు. అయితే ఈ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది.  కుమారీ ఆంటీ  గతంలో ఎక్కడ  ఫుడ్ బిజినెస్ నిర్వహించారో అదే చోట ఫుడ్ బిజినెస్ నిర్వహించుకొనేందుకు  రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కుమారీ ఆంటీ  తిరిగి  తన ఫుడ్ బిజినెస్ ను ప్రారంభించారు. కుమారీ ఫుడ్ బిజినెస్ మూసివేత అంశం రాజకీయంగా రచ్చకు కూడ కారణమైంది.  

also read:కుమారీ ఆంటీ‌కి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: పాతస్థలంలోనే ఫుడ్ బిజినెస్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ విషయమై సోషల్ మీడియాలో వచ్చిన  మాటలు, వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని  డీజే పాట ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారీ ఆంటీ  ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు.

also read:నాకు వరమిచ్చారు: రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కుమారీ ఆంటీ

DJ Mix aaa 🙄 🤦🏻 pic.twitter.com/RhIxRxUm1Z

— Rajesh Manne (@rajeshmanne1)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడకు  చెందిన కుమారీ ఆంటీ  హైద్రాబాద్ మాదాపూర్ లో రోడ్డు పక్కన ఫుడ్ సెంటర్ ను దాదాపు 13 ఏళ్ల క్రితం ప్రారంభించారు.  అయితే అప్పటి నుండి  ఆమె  వ్యాపారం కొనసాగిస్తున్నారు.  వినియోగదారుల సూచన మేరకు  కొత్త కొత్త వంటకాలను కూడ ఆమె ప్రారంభించారు.   నాణ్యతతో పాటు రుచికరంగా ఉండడంతో  ఆమె  ఫుడ్ బిజినెస్ దినదినాభివృద్ది చెందుతూ వచ్చింది.

 

అయితే అదే సమయంలో  యూట్యూబర్లు కొందరు  ఈ సెంటర్ లో ఫుడ్ తిని  ఓ పోస్టు చేశారు. అంతే కాదు మరికొందరు కుమారీ ఆంటీ భోజనం తయారీ గురించి వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టులతో  ఈ బిజినెస్ కు గిరాకీ పెరిగింది. 

click me!