రేవంత్ రెడ్డి అరెస్ట్: రంగంలోకి ట్రబుల్ షూటర్

By narsimha lodeFirst Published Dec 4, 2018, 1:02 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్ చేయడంతో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు.

కొడంగల్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్ చేయడంతో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. రేవంత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటామని హమీ ఇచ్చారు.  రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఈసీని కలవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మంగళవారం నాడు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ కూడ సీరియస్ గా తీసుకొంది. తమ పార్టీ ముఖ్య నేత రేవంత్ రెడ్డిని  పోలీసులు  అరెస్ట్ చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేయాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఇవాళ  మధ్యాహ్నం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి  ఫిర్యాదు చేయాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు  గులాం నబీ ఆజాద్, కర్ణాటక మంత్రి డికె శివకుమార్ లు రేవంత్ రెడ్డి సతీమణి గీతకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. 
రేవంత్ రెడ్డి అరెస్ట్ తో  ఎలాంటి భయబ్రాంతులకు  గురికాకూడదని  శివకుమార్ ఆమెకు ధైర్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ  ముఖ్యనేతలు గులాం నబీ ఆజాద్ కూడ పోన్ చేశారు.  పార్టీ మొత్తం రేవంత్ రెడ్డికి  అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై  ఈసీని కలిసి ఫిర్యాదు చేయాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  కేసీఆర్ సభను  పురస్కరించుకొని నిరసన ప్రదర్శనలకు  రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా  ఆయనను ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రేవంత్ ఆచూకీ కోసం గీత ఏం చేసిందంటే

రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ భారీ కుట్ర: గీత (ఆడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

 

click me!