ప్రజా కూటమి దేశానికి దిక్సూచి: రాహుల్

By narsimha lodeFirst Published Nov 28, 2018, 4:34 PM IST
Highlights

ప్రజా కూటమి దేశానికి దిక్సూచిగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 


ఖమ్మం: ప్రజా కూటమి దేశానికి దిక్సూచిగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రజా కూటటమి అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఖమ్మంలో బుధవారం నాడు నిర్వహించిన పీపుల్స్ ఫ్రంట్ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఓ వైపు, తెలంగాణ ప్రజలంతా మరో వైపు నిలిచారని రాహుల్ గాంధీ చెప్పారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు కూడ బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ ఓటేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కేంద్రంలోని మోడీ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని రాహుల్ గుర్తు చేశారు.

కేంద్రంలోని మోడీ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని రాహుల్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఇచ్చిన హమీలు అమలు కాలేదన్నారు. కానీ,బీజేపీ అమలు చేసిన ప్రతి పనికి టీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం మోడీ మాత్రం అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రాజెక్టుల రీ డీజైన్ల పేరుతో కోట్లాది రూపాయాలను అదనంగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణకు 17 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే  అప్పుల పాలు చేశారని చెప్పారు.

తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకొన్న అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలను అందిస్తామని రాహుల్ చెప్పారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తామన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి స్వయం సహాయక సంఘానికి రూ.లక్ష చొప్పున గ్రాంట్ గా అందిస్తామన్నారు. 

తెలంగాణలోని నరేంద్ర మోడీ బీ టీమ్ అధికారంలో ఉందన్నారు. నరేంద్ర మోడీ బీ టీమ్ ను ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు: చంద్రబాబు

ఇక కేసీఆర్‌ ఫాం హౌజ్‌కే : సురవరం సెటైర్లు

బాబు, రాహుల్ నవ్వులు: ఖమ్మం సభలో ఆసక్తికర సన్నివేశం

ఖమ్మంకు బయలుదేరిన బాబు: రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

ఖమ్మం నుండి బాబు, రాహుల్ ఎన్నికల ప్రచారం

రంగంలోకి బాబు: రాహుల్‌తో పాటు తెలంగాణలో ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

click me!