రేవంత్‌పై పరువు నష్టం దావా: డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. కోర్టు ఆదేశాలు

By Siva KodatiFirst Published Sep 21, 2021, 5:57 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌కు సంబంధించి సిటీ సివిల్ కోర్ట్ తీర్పు వెలువరించింది. డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది.  అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 20కి వాయిదా వేసింది. 
 
టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య ఈ వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారంటూ రేవంత్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. 

తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టును కేటీఆర్ కోరారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా రేవంత్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

click me!