సీట్ల చిచ్చు: టీడీపీకి మల్లయ్య యాదవ్ గుడ్‌బై... ఇవాళ టీఆర్ఎస్‌లో చేరిక

By sivanagaprasad KodatiFirst Published Nov 16, 2018, 8:36 AM IST
Highlights

టీటీడీపీలో అసంతృప్తుల సెగలు భగ్గుమంటున్నాయి. సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ పలు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు

టీటీడీపీలో అసంతృప్తుల సెగలు భగ్గుమంటున్నాయి. సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ పలు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. కోదాడకు చెందిన బొల్లం మల్లయ్య యాదవ్‌ పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మహాకూటమి పొత్తుల్లో భాగంగా కోదాడ టికెట్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి... పద్మావతికి కేటాయించారు. దీంతో అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలనుకున్న మల్లయ్య చివరి వరకు ప్రయత్నించారు.

ఒక క్రమంలో రెబల్‌గా పోటీ చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో టీడీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. అనుకోని కారణాల వల్ల తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

ఈ నిర్ణయం కొందరికి బాధను, ఇంకొందరికి సంతోషాన్ని కలిగిస్తుందని.. కానీ రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తనను ఆశీర్వదించాలని మల్లయ్య కోరారు. ఈ రోజు హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మల్లయ్య గులాబీ కండువా కప్పుకోనున్నారు.

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

ఎన్నికల విచిత్రం..ప్రత్యర్థులు మారలేదు, పార్టీలే మారాయి
 

click me!