ప్రమాదానికి ముందు అక్కడ కాసేపు ఆగిన హరికృష్ణ

By ramya neerukondaFirst Published Aug 30, 2018, 10:13 AM IST
Highlights

బుధవారం తెల్లవారుజామున నెల్లూరుకు బయలుదేరి వెళ్తున్న క్రమంలో చింతల్‌కుంటలో 5 నిమిషాల పాటు ఆగారు. ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు వెంకట్రావును కూడా కారులో ఎక్కించుకొని వెళ్లేందుకు.. స్థానికంగా ఉన్న దుర్గా విలాస్‌ హోటల్‌ ముందు ఆగారు. 

సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. నెల్లూరులోని స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళుతుండగా.. ఆయన కారు ప్రమాదానికి గురయ్యింది. అయితే.. ఆయన నెల్లూరు వెళ్లేదారిలో ఒకచోట కాసేపు ఆగి ఆతర్వాత మళ్లీ బయలుదేరారట. అది మరెక్కడో కాదు ఎల్బీనగర్.

ఎల్బీనగర్ చింతలకుంటలో ఆయనకు ఎక్కువగా స్నేహితులు ఉన్నారు. ముప్పై ఏళ్లుగా ఇక్కడి పశువుల సంతకు నిత్యం వచ్చి వెళ్తుండేవారు. చిన్ననాటి స్నేహితుడు నాగేశ్వరరావుకు చెందిన పశువుల పాకలో గంటల తరబడి కాలక్షేపం చేసేవారు. వారానికి నాలుగైదు సార్లు ఇక్కడికి వచ్చే వారని స్థానికులు పేర్కొన్నారు. రాజమండ్రిలో రూ.4లక్షలకు కపిలి ఆవును కొనుగోలు చేసి ఇక్కడ సుమారు 4 ఏళ్ల పాటు పెంచి తర్వాత గన్నవరంలోని తన స్నేహితుడు పూర్ణచందర్‌రావుకు ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. హరికృష్ణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత చింతల్‌కుంటకు రావటం తగ్గించారని వారు పేర్కొంటున్నారు. తమది 40 ఏళ్ల స్నేహమని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిత్యం తనను కలిసేందుకు చింతల్‌కుంట పశువుల సంతకు వచ్చేవారని తెలిపారు.

హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున నెల్లూరుకు బయలుదేరి వెళ్తున్న క్రమంలో చింతల్‌కుంటలో 5 నిమిషాల పాటు ఆగారు. ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు వెంకట్రావును కూడా కారులో ఎక్కించుకొని వెళ్లేందుకు.. స్థానికంగా ఉన్న దుర్గా విలాస్‌ హోటల్‌ ముందు ఆగారు. పశువుల సంత వ్యాపారులు సత్తిబాబు, సాంబశివరావు అతని కారు వద్దకు వెళ్లి మాట్లాడారు.

 

read more related news

హరికృష్ణ మృతి...ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులు సంతాప దినాలు

హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ స్థాపన వెనక...

ఎన్టీఆర్ విలపిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది!    

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

అన్న మరణంతో బాలయ్య కన్నీరుమున్నీరు!

హరికృష్ణ మృతి: మీడియాకి మంచు మనోజ్ రిక్వెస్ట్!

తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ

ఆ ఘటనతోనే హరికృష్ణ బాగా కుంగిపోయారట

గాయాలతో బయటపడతారనుకున్నా.. హరికృష్ణ మృతిపై పవన్ కళ్యాణ్!

click me!