కేటీఆర్ విదేశాల్లో ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు.. డ్రగ్స్ కేసు‌లో సిట్ రిపోర్ట్ బయటపెట్డండి: బండి సంజయ్

By Sumanth KanukulaFirst Published Dec 21, 2022, 12:09 PM IST
Highlights

తెలంగాణ మంత్రి  కేటీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి తనను సంస్కారంతో పెంచాడని అన్నారు.

తెలంగాణ మంత్రి  కేటీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి తనను సంస్కారంతో పెంచాడని అన్నారు. తాము కేసీఆర్, కేటీఆర్, కవిత లెక్క తాము సంస్కార హీనులం కాదని విమర్శించారు. కేటీఆర్ అహకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ వినియోగంపై తాము ఎప్పుడో సవాలు చేస్తే.. కేటీఆర్ ఇప్పుడు స్పందిస్తున్నారని అన్నారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని.. ఇప్పుడు దొరకననే ధైర్యంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాము సవాలు చేసినప్పుడే శాంపిల్స్ ఇచ్చి ఉంటే అసలు విషయం బయటపడేదని అన్నారు. కేటీఆర్ ట్రీట్‌మెంట్ చేసుకోని వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఎవరూ ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. సిట్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని, విచారణను ఎందుకు మధ్యలో ఆపేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెరవెనక కేటీఆర్ దోస్తులు ఎవరున్నారని ప్రశ్నించారు. వేములవాడకు కేసీఆర్ ఇస్తానన్న రూ. 400 కోట్లు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. వేములవాడ, కొండగట్టులలో వచ్చే డబ్బులు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. 

తీగలగుట్టపల్లి సమస్య ఇప్పటిది కాదని.. ఎప్పటి నుంచో సమస్య ఉందని అన్నారు. బండి సంజయ్ గెలిచి మూడేళ్లే అవుతుందని.. అందులో ఒక్క సంవత్సరం కోవిడ్‌తోనే పోయిందన్నారు. తీగలగుట్టపల్లి ఆర్‌వోబీ ఇన్ని రోజులు నిర్లక్ష్యానికి గురైందని.. ఎందుకు అప్రూవల్ ఇవ్వలేదని ప్రశ్నించారు. చివరకు లొల్లిపెడితే రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిందని అన్నారు. తాము కేంద్ర ప్రభుత్వం వాటాకు సంబంధించి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొచ్చామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 80 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కావాలనే బీజేపీని బద్నాం చేస్తున్నారని విమర్శించారు.  

కేటీఆర్, కేసీఆర్‌లకు వాళ్లకు తిట్టుడు, బూతులు మాట్లాడుడు అలవాటు పోయిందని అన్నారు. కవిత పేరు లిక్కర్ కేసులో ఉన్నప్పుడు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

click me!