హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ .. తెరపైకి మరో 15 మంది వ్యాపారవేత్తల పేర్లు

By Siva KodatiFirst Published Jan 26, 2022, 4:13 PM IST
Highlights

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో (drugs case) కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను గుర్తించారు పోలీసులు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు గజేంద్ర, విపుల్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు (task force police) గాలిస్తున్నారు

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో (drugs case) కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను గుర్తించారు పోలీసులు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు గజేంద్ర, విపుల్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు (task force police) గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం బడా పారిశ్రామికవేత్తలుగా కొనసాగుతున్నారు గజేంద్ర, విపుల్. టోనీ దగ్గరి నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్‌ను తీసుకుంటున్నారు గజేంద్ర, విపుల్. హైదరాబాద్‌లో రూ.500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారవేత్తలు. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో 15 మంది వ్యాపారవేత్తల వివరాలను సేకరిస్తున్నారు. వీరు రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందినవారై వుంటారని అనుమానిస్తున్నారు. 

ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన  డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చూపించారు. వీరిలో 10 మంది పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇతర సహాయకులను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీతో పాటు ముఠా సభ్యులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పరారీలో వున్న 10 మంది కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మహ్మద్ ఆసిఫ్, షేక్ మహమ్మద్, షాహిద్ ఆలం, అఫ్తాబ్, రెహమత్, ఇర్ఫాన్, ఇమ్రాన్, సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్, అశోక్ జైన్‌లు పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో వున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

మత్తు మందుకు బిగ్‌షాట్స్, పెద్ద పెద్ద వ్యాపారులు కస్టమర్లుగా వున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఏడుగురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు బిజినెస్‌మెన్‌లు. ముంబై డ్రగ్ మాఫియాకు చెందిన టోనీతో డ్రగ్స్ తెప్పించుకున్నారు వ్యాపారవేత్తలు. ఈ కేసులో పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఏ1 కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్‌, రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశ్వత్ జైన్, కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, ప్రముఖ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారి వెంకట్ చలసాని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

click me!