అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

By ramya neerukondaFirst Published Oct 4, 2018, 12:17 PM IST
Highlights

బుధవారం సాయంత్రం ఆమె ప్రణయ్‌ కుటుంబసభ్యులతో కలిసి వన్‌టౌన్‌ సీఐని సంప్రదించింది. 
 

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొద్ది రోజుల క్రితం తక్కువ కులస్థుడిని పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. కాగా.. అప్పటి  నుంచి మీడియాతో మాట్లాడుతూ.. అమృత రోజూ వార్తలో నిలిచింది.

కాగా.. మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కింది. ణయ్‌ హత్య తర్వాత సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రణయ్ భార్య అమృత వర్షిణి వన్‌టౌన్‌ పోలీసులను కోరింది. బుధవారం సాయంత్రం ఆమె ప్రణయ్‌ కుటుంబసభ్యులతో కలిసి వన్‌టౌన్‌ సీఐని సంప్రదించింది. 

ఇటీవల సోషల్‌ మీడియాలో తమను కించపరిచే విధంగా పోస్టింగ్‌లు వస్తున్నాయని, అలాంటి అసత్య ప్రచారాలను ఆపాలని కోరినా మార్పు లేకపోవడంతో చట్టపరమైన చర్యలకు సిద్ధపడినట్లు తెలిపింది. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే పూర్వాపరాలను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్‌ సీఐ సదానాగరాజు పేర్కొన్నారు. ఈ విషయమై నేడో రేపో సమగ్ర వివరాలతో కూడిన ఫిర్యాదును అమృత పోలీసులకు అందించనుంది. అదేవిధంగా ప్రణయ్‌ పోస్టుమార్టం రిపోర్టు నకలు పత్రాలు అందించాలని కోరింది.

 

read more news

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ విగ్రహం.. కోర్టు ఏమందంటే..

ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

click me!