చిట్టీల పేరుతో రూ.2కోట్లు స్వాహా.. తహశీల్దార్ అరెస్టు

By ramya neerukondaFirst Published Oct 4, 2018, 11:54 AM IST
Highlights

చిట్టీల పేరుతో రూ.2కోట్లు స్వాహా.. తహశీల్దార్ అరెస్టు

చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఓ తహసీల్దార్ ప్రస్తుతం కటకటాలపాలైంది. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్‌లోని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలోని  తహసీల్దార్‌ లింగాల సుధను బుధవారం హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు అరెస్టు చేశారు. ఈమె సమీప బంధువులు, స్నేహితులతో కలిసి సనత్‌నగర్‌ కేంద్రంగా అక్రమంగా చిట్టీల దందా నిర్వహించడంతోపాటు రూ.2 కోట్లు స్వా హా చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. విధులకు సైతం హాజరుకాకుండా ఆరు నెలలుగా పరారీలో ఉన్న సుధను ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం అదుపులోకి తీసుకుంది.

లింగాల సుధ గతంలో నిజామాబాద్‌ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. ఈమెతో పా టు న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె భర్త మల్లేశం, ఆమె సోదరి డాక్టర్‌ శ్రావ్య, డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీ సర్‌ మనోహర్‌రావు, హెడ్‌–మాస్టర్‌ విజయమ్మ తదితరులతో కలిసి సనత్‌నగర్‌ కేంద్రంగా చిట్టీల దందా ప్రారంభించారు. 

ప్రభుత్వోద్యోగులై ఉండి నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా దాదాపు 15 ఏళ్ల పాటు ఈ దందా నిర్వహించారు. వీరంతా ప్రభుత్వ ఉ ద్యోగులు, కీలక వ్యక్తులు కావడంతో ఆయా విభా గాల్లో పనిచేసిన పలువురు ఉద్యోగులు వీరి వద్ద చిట్టీలు కట్టారు. ఖాతాదారులు చిట్టీ పాడుకున్నప్పటికీ నగదు వారికి ఇవ్వకుండా రూ.2 వడ్డీ ఇస్తామంటూ తమ వద్దే ఉంచుకునేవారు.

తక్కువలో తక్కువ రూ.5లక్షల నుంచి రూ.25లక్షల వరకు చిట్టీలు వేసేవారు.కొందరు ఖా తాదారులకు సుధ తదితరులు తమ పేర్లతో ఏర్పాటు చేసిన ఉమ్మడి బ్యాంకు ఖాతా ద్వారా చెక్కుల రూపంలో చెల్లింపులు చేశారు. అత్యధికుల నుంచి మాత్రం అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు స్వీకరించారు. వీరి చిట్టీల దందా కొన్నాళ్ల పాటు సజావుగానే సాగినా... ఆపై కథ అడ్డం తిరిగింది. వీరిచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో 35 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చే శారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు సూత్రదారి సుధను బుధవారం అరెస్టు చేశారు. 

click me!