పార్టీ మార్పుపై తేల్చేసిన బొడిగె శోభ

Published : Oct 04, 2018, 12:07 PM IST
పార్టీ మార్పుపై  తేల్చేసిన బొడిగె శోభ

సారాంశం

 తాను పార్టీ మారుతున్నట్టు  వస్తున్న  వదంతులను నమ్మకూడదని  తాజా మాజీ ఎమ్మెల్యే  బొడిగె శోభ చెప్పారు.


కరీంనగర్: తాను పార్టీ మారుతున్నట్టు  వస్తున్న  వదంతులను నమ్మకూడదని  తాజా మాజీ ఎమ్మెల్యే  బొడిగె శోభ చెప్పారు.  సెప్టెంబర్ 6వ తేదీన  కేసీఆర్ ప్రకటించిన జాబితాలో బొడిగె శోభకు టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఆమె పార్టీ మారుతున్నట్టు  ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ఆమె స్పష్టత ఇచ్చారు.

చొప్పదండి టిక్కెట్టు తనకు దక్కని కారణంగా తాను టీఆర్ఎస్‌ను వీడుతున్నట్టు జరగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని  ఆమె ప్రకటించారు.  ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు.  తాను ఎట్టి పరిస్థితుల్లో  టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు.

కేసీఆర్‌కు తాను కూతురులాంటిదాన్నని ఆమె చెప్పారు.  తనకు తప్పకుండా  న్యాయం చేస్తారని  చెప్పారు. కేసీఆర్ తనకే టిక్కెట్టు ఇస్తారనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. అందరిని కలుపుకొని చొప్పదండిలో గులాబీజెండాను ఎగురవేస్తామని  చెప్పారు.  తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్