ఆపరేషన్ ముస్కాన్: గుట్టలో15 మంది మైనర్లకు వ్యభిచారం నుండి విముక్తి

First Published Aug 2, 2018, 2:43 PM IST
Highlights

యాదగిరిగుట్టలో ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా  గురువారం నాడు  మరోసారి పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తాజాగా నలుగురు  బాలికలను రక్షించారు.  తమ పిల్లలు తప్పిపోయినట్టు ఉంటే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రకటించారు.
 

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా  గురువారం నాడు  మరోసారి పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తాజాగా నలుగురు  బాలికలను రక్షించారు.  తమ పిల్లలు తప్పిపోయినట్టు ఉంటే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రకటించారు.

ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా  గురువారం నాడు  పోలీసులు  యాదగిరిగుట్టలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  మరో నలుగురు బాలికలను  వ్యభిచార కూపం నుండి రక్షించారు. 

అదే విధంగా యాదగిరిగుట్టలోని ఓ నర్సింగ్‌హోమ్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బాలికలకు త్వరగా పీరియడ్స్ వచ్చేలా ఇచ్చే హార్మోన్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకొన్నారు. మరో వైపు కొందరు ఆర్ఎంపీలు కూడ  వ్యభిచార ముఠా నిర్వాహకులకు సహకరిస్తున్నారని పోలీసులు తెలిపారు.వారిని కూడ అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.

 బస్సు స్టేషన్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోయిన వారు తమను సంప్రదించాలని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు.  డీఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా ఆయా కుటుంబసభ్యులకు  పిల్లలను అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్ లో ఇప్పటివరకు 15 మంది బాలికలను వ్యభిచార కూపం నుండి రక్షించినట్టు ఆయన తెలిపారు. 

ఈ వార్త చదవండి::హార్మోన్ ఇంజక్షన్లు: 10 ఏళ్ళలోపు చిన్నారులను సెక్స్‌కు సిద్దం చేస్తున్న ముఠా

 

click me!