Asianet News TeluguAsianet News Telugu

హార్మోన్ ఇంజక్షన్లు: 10 ఏళ్ళలోపు చిన్నారులను సెక్స్‌కు సిద్దం చేస్తున్న ముఠా

యాదాద్రి భువనగరి జిల్లాలో  చిన్నారులను  వ్యభిచార రొంపిలోకి దింపేందుకు  గాను వ్యభిచార నిర్వాహకులు దారుణాలకు పాల్పడుతున్నారు. పదేళ్లలోపు అమ్మాయిలను కూడ వ్యభిచారం చేసేందుకు అనువుగా తయారు చేసేలా  వారికి హర్మోన్ ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారు. 

Girls Below 10 Given Hormonal Injections In Telangana Sex racket

యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగరి జిల్లాలో  చిన్నారులను  వ్యభిచార రొంపిలోకి దింపేందుకు  గాను వ్యభిచార నిర్వాహకులు దారుణాలకు పాల్పడుతున్నారు. పదేళ్లలోపు అమ్మాయిలను కూడ వ్యభిచారం చేసేందుకు అనువుగా తయారు చేసేలా  వారికి హర్మోన్ ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారు.  ఈ ఇంజక్షన్ల ప్రభావంతో  సాధారణ వయస్సు కంటే ముందే  ఆ బాలికలు పీరియడ్స్ ప్రారంభమౌతున్నాయి. ఈ ముఠా సభ్యులకు ఓ డాక్టర్ సహకరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నవారంతా బాలికలను  చేరదీసి  వారికి హర్మోన్ ఇంజక్షన్లు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని  పోలీసుల విచారణలో తేలింది.

యాదగిరిగుట్టలోని పాతగుండ్లపల్లిలోని కళ్యాణి అనే మహిళ ఇంట్లో నుండి చిన్నారి అరుపులు విన్పించాయి,.ఈ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కళ్యాణి ఇంటిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో కళ్యాణి ఇంట్లో ఇద్దరు చిన్నారులు  కన్పించారు.  ఒక్క చిన్నారి తన కూతురుగా కళ్యాణి చెప్పింది. మరో బాలిక శరీరంపై గాయాలున్నాయి.

అయితే రెండో బాలిక విషయమై కళ్యాణి సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో కళ్యాణిని పోలీసులు ఐసీడీఎస్ అధికారులు  అడిగిన ప్రశ్నలకు ఆమె  సమాధానం చెప్పలేకపోయింది.  చివరికి ఆ బాలికను తాను కొనుగోలు చేసినట్టు చెప్పింది. యాదగిరిగుట్టలో తనతో పాటు మరికొందరి ఇళ్లలో కూడ  పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  

ఈ తనిఖీల్లో  11 మంది బాలికలను  పోలీసులు రక్షించారు.  వీరిలో  సుమారు నలుగురు బాలికలు 7 ఏళ్లలోపు వారే ఉన్నారు. రైల్వేఫ్లాట్‌ఫామ్‌లతో పాటు అనాధ పిల్లలను అక్కున చేర్చుకొంటామని నమ్మించి  పిల్లలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పేదరికంలో ఉన్న పిల్లలను  తీసుకొచ్చి ఈ ముఠా ఆ పిల్లలను వ్యభిచారంలోకి దింపుతున్నారు.

పదేళ్లలోపు పిల్లలకు త్వరగా పీరియడ్స్ వచ్చేలా ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంజక్షన్లు  ఇప్పిస్తున్నారు. ఈ ఇంజక్షన్ ప్రభావంతో  పీరియడ్స్ ప్రారంభం కాగానే ఆ పిల్లలతో ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

ఈస్ట్రోజన్ ఇంజక్షన్ ఇచ్చినందుకు డాక్టర్‌కు కనీసం రూ.25వేలు ఇస్తున్నారని  పోలీసులు గుర్తించారు. బాలికలను రూ.20 నుండి రూ.25ల నుండి లక్ష రూపాయాలకు కూడ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 

పిల్లలను చేరదీసిన వారంతా గతంలో వ్యభిచారం నిర్వహించేవారు. వ్యభిచారాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పిస్తున్నప్పటికీ  ఇంకా కొందరు  ఆ వృత్తిలోనే కొనసాగుతున్నారు. అంతేకాదు చిన్న పిల్లలను కొనుగోలు చేసి కూడ ఈ రకంగా  వ్యభిచార వృత్తిలోకి దింపడంపై పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు.

ఈ ముఠాలో కీలకంగా ఉన్న యాదగిరిపై పోలీసులు పీడీ యాక్టు పెట్టి అరెస్ట్ చేశారు. కళ్యాణితో పాటు  మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల ఇళ్లను కూడ సీజ్ చేసేందుకు  ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో మైనర్ బాలికలను  వ్యభిచార ముఠా నుండి పోలీసులు రక్షించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios