నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

By narsimha lodeFirst Published Mar 29, 2019, 12:52 PM IST
Highlights

నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బరిలో ఉన్న 178 ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించింది.

నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బరిలో ఉన్న 178 ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించింది.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 185 మంది  అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఏడుగురు అభ్యర్థులు మినహా మిగిలిన 178 మంది అభ్యర్థులు రైతులే.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల తరపున ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల సాధన కోసం  నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ స్థానంలో పోటీకి దిగారు.

పసుపు,  ఎర్రజొన్న రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ తమ నిరసనను పాలకులకు తెలపాలనే ఉద్దేశ్యంతో నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు నేతలు నామినేషన్లను ఉపసంహరించుకోవాలని రైతులను కోరినా కూడ రైతులు మాత్రం పోటీలోనే కొనసాగారు. నలుగురు రైతులు మినహా మిగిలిన వారంతా కూడ బరిలోనే ఉన్నారు.

96 కంటే ఎక్కువ మంది బరిలో ఉంటే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటాయి. దీంతో నిజామాబాద్ ఎంపీ స్థానానికి  బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

దిగిరాని రైతులు: కవిత సహా ప్రధాన పార్టీల అభ్యర్థులకు తిప్పలే

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

కవిత సీటుకు రైతుల భారీ నామినేషన్లు

ఖమ్మం పార్లమెంట్‌ నుండి పోటీకి సుబాబుల్ రైతుల ప్లాన్

ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

కవితకు చిక్కులు: పసుపు రైతులకు దారి చూపిన నల్గొండ

నిజామాబాదులో కదం తొక్కిన ఎర్రజొన్న, పసుపు రైతులు (ఫొటోలు)

click me!