ట్విట్టర్ సి‌ఈ‌ఓ పదవికి ఎలోన్ మస్క్ రాజీనామా.. ట్విట్టర్ పోల్ ద్వారా వెల్లడి..

By asianet news telugu  |  First Published Dec 21, 2022, 11:02 AM IST

ట్విట్టర్ పోల్ ఫలితాలకు బాట్ అక్కౌంట్ ని ఎలోన్ మస్క్ తప్పుపట్టారు. పోల్‌లో ఓటు వేయడానికి ఇప్పుడు మార్పు చేయబడుతుందని ఇంకా బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే  పోల్‌కు ఓటు వేయగలరని ఎలోన్ మస్క్ చెప్పారు.  


మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో  భారీ మార్పుల కారణంగా ఎలోన్ మస్క్ నిరంతరం విమర్శలకు గురవుతున్నారు. తాజాగా ట్విట్టర్ చీఫ్ పదవి నుండి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయానికి సంబంధించి ట్విట్టర్ యూజర్ల అభిప్రాయాన్ని కూడా ఆయన కోరారు. ట్విట్టర్ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలా అని ప్రజలను కోరుతూ ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు.

దీనికి సంబంధించి ట్విట్టర్ పోల్ కూడా నిర్వహించారు. పోల్ ముగింపు సమయానికి  17.5 మిలియన్ల మంది యూజర్లు ప్రతిస్పందించారు, వీరిలో ఎక్కువ మంది ఎలోన్ మస్క్ ట్విట్టర్ చీఫ్ పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు పోల్ చేశారు. 

Latest Videos

undefined

బ్లూ టిక్  సబ్ స్క్రైబర్స్  మాత్రమే 
ట్విట్టర్ పోల్ ఫలితాలకు బాట్ అక్కౌంట్ ని ఎలోన్ మస్క్ తప్పుపట్టారు. పోల్‌లో ఓటు వేయడానికి ఇప్పుడు మార్పు చేయబడుతుందని ఇంకా బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే  పోల్‌కు ఓటు వేయగలరని ఎలోన్ మస్క్ చెప్పారు.  నిజానికి పోల్ కోసం  బ్లూ సబ్‌స్క్రైబర్‌లను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని ఒక యూజర్ ఎలోన్ మస్క్‌తో అన్నారు. దీనికి ఎలోన్ మస్క్ స్పందిస్తూ ఇది మంచి పాయింట్ అని అన్నారు. ఇంకా దీనికి సంబంధించి ట్విట్టర్ మార్పులు చేయనుంది అని తెలిపారు. 

ఏది ఏమైనప్పటికి ట్విట్టర్ పోల్ ఫలితాన్ని ఫాలో అవుతానని ఎలోన్ మస్క్ చెప్పారు. పోలింగ్ ముగిసే సమయానికి 17,502,391 ఓట్లు పోలయ్యాయి. పోల్‌లో, 57.5 శాతం మంది యూజర్లు  ఎలోన్ మస్క్ సి‌ఈ‌ఓ పదవి నుండి వైదొలగాలని అనుకూలంగా ఓటు వేశారు, అయితే 42.5 శాతం మంది యూజర్లు ఎలోన్ మస్క్ ట్విట్టర్ చీఫ్ పదవిని విడిచిపెట్టాలని కోరుకోవడం లేదని ఓటు వేశారు. పోల్ ఫలితాల తర్వాత ఎలోన్ మస్క్ నిజంగా ట్విట్టర్ చీఫ్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది!

నిరంతరం విమర్శలకు గురవుతున్న ఎలోన్ మస్క్ అక్టోబర్‌లో ట్విట్టర్‌ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలపై నిత్యం విమర్శలు వస్తున్నాయి. 

ఎలోన్ మస్క్ మంగళవారం  ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుండి వైదొలగనున్నట్లు తెలిపారు. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ చీఫ్‌గా వైదొలగుతున్నట్లు ఎలోన్ మస్క్ పేర్కొనడం ఇదే మొదటిసారి. ఎలోన్ మస్క్ పదవీ విరమణ చేయాలని వాల్ స్ట్రీట్ పిలుపులు వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి. 

"ఈ పదవిని చేపట్టే సరైన వ్యక్తిని కనుగొన్న వెంటనే నేను సి‌ఈ‌ఓ పదవికి రాజీనామా చేస్తాను! ఆ తర్వాత, నేను సాఫ్ట్‌వేర్ & సర్వర్‌ల టీంస్  నడుపుతాను" అని ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

click me!