నోకియా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 8.1 ఆవిష్కరణ: 10న ఇండియా మార్కెట్లోకి..

By rajesh yFirst Published Dec 6, 2018, 3:13 PM IST
Highlights

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ దారు నోకియా నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 8.1ను మార్కెట్లో ఆవిష్కరించింది. దుబాయిలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించిన ఈ ఫోన్ ను భారతదేశంలో వచ్చే సోమవారం ప్రవేశపెడతారని భావిస్తున్నారు. యూరప్ మార్కెట్లో 399 యూరోలు పలుకుతున్న ఈ ఫోన్ మనదేశంలో రూ.30 వేల లోపే ఉంటుందని అంచనా. అయితే నోకియా 7 ప్లస్ ఫోన్ రీప్లేస్‌మెంట్‌కు ఇది సరైన జోడీ కానున్నది. 
 

దుబాయి: ప్రముఖ మొబైల్‌ తయారీదారు నోకియా కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మా‍ర్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. బుధవారం  దుబాయ్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో నోకియా 8.1 స్మార్ట్ ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఆవిష్కరించింది. భారతదేశ మార్కెట్లోకి ఈ నెల 10న విడుదల చేయనున్నది తెలుస్తోంది. స్నాప్ డ్రాగన్ 710 ఎస్వోసీ పవర్, ఆండ్రాయిడ్ 9పై ఆప్షన్లు ఉన్నాయి. వీటితోపాటు 6.8 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతోపాటు 2.2గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. 

ఇంకా 1080x2244  పిక్సెల్‌ రిజ్యూలూషన్, 4జీబీ ర్యామ్ సామర్థ్యం, 64 జీబీల నుంచి 400 జీబీ వరకు నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో 12+13 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాతోపాటు 20 ఎంపీ సెల్ఫీకెమెరా అందుబాటులో ఉంటుంది. దీనికి మద్దతుగా 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఏర్పాటు చేశారు. యూరప్ మార్కెట్లో 399 యూరోలకే (రూ.32 వేలు) ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

నోకియా ఎక్స్ 7 ఫోన్ డిజైన్, హార్డ్ వేర్‌తోనే రూపుదిద్దుకున్న నోకియా 8.1 స్మార్ట్ ఫోన్.. నోకియా 7 ప్లస్‌కు ప్రత్యామ్నాయం కానున్నది. ఈ ఏడాది చివరిలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు చౌక ధరలో అందుబాటులో ఉంటే ఫోన్ కూడా ఇదే. యూరప్ మార్కెట్లో 399 యూరోలకు లభిస్తున్నా.. భారతదేశంలో దాని ధర రూ.30 వేల లోపే ఉంటుందని భావిస్తున్నారు. నోకియా 7 ప్లస్ ఫోన్ స్థానే రీప్లేస్ చేసుకునేందుకు సరైన స్మార్ట్ ఫోన్ అని చెబుతున్నారు. 

click me!