వీడియో లవర్స్‌ కోసం మోటో ‘వన్‌యాక్షన్‌’.. రూ.14 వేల లోపే

By rajesh yFirst Published Aug 24, 2019, 12:31 PM IST
Highlights

వీడియోలో మన కదలికలు చూసుకుంటే అదో మత్తు.. గమ్మత్తు. కానీ కేవలం యాక్షన్ ప్రారంభిస్తే చాలు వీడియో తీసే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అది మోటోరోలా సంస్థ తన వన్ సిరీస్‌లో భాగంగా ‘వన్ యాక్షన్’ ఫోన్ తీసుకొచ్చింది.ఈ నెల 30 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

న్యూఢిల్లీ‌: వీడియో ప్రేమికులకు శుభవార్త. ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా మరో కొత్త మొబైల్‌ ఫోన్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. వన్‌ సిరీస్‌కు కొనసాగింపుగా.. మోటోరొలా వన్‌ యాక్షన్‌ మోడల్‌ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా వీడియోలు క్రియేట్‌ చేసేవారిని దృష్టిలో పెట్టుకుని కొత్త వసతులతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది.

ఇందులోని 117 డిగ్రీల అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ద్వారా డీటెయిల్డ్‌ వీడియోలను రికార్డ్‌ చేయొచ్చు. సులభంగా చెప్పాలంటే యాక్షన్‌ కెమెరాలా ఇది పని చేస్తుంది. ఈ ఫోన్‌ను వెర్టికల్‌గా ఉంచి కూడా ల్యాండ్‌స్కేప్‌ వీడియోలను రికార్డ్‌ చేయొచ్చు.

4జీబీ/ 128జీవీ వేరియంట్‌లో వస్తున్న ఈ ఫోన్‌ ధరను రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని విక్రయం ప్రారంభం కానుంది. లాంచ్‌ ఆఫర్‌ కింద రూ.2,200 విలువ చేసే జియో ఇన్‌స్టంట్‌ కూపన్లను అందించనున్నది. 125జీబీ అదనపు 4జీ డేటాను ఇవ్వనున్నారు. డెనిమ్‌ బ్లూ, పెరల్‌ వైట్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యం కానుంది.

ఆండ్రాయిడ్‌ వన్‌  ప్రొగ్రామ్‌ కింద వస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 9.0 పై ఓఎస్‌తో పనిచేయనున్నది. ఆండ్రాయిడ్‌ 10, 11 వెర్షన్ల వరకు అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే 21:9 నిష్పత్తిలో సినిమా విజన్‌ డిస్‌ప్లేతో వస్తోంది.

ఇందులో శామ్‌సంగ్‌ ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 9609 ప్రాసెసర్‌ను వినియోగించారు. బ్యాక్16+12+5 ఎంపీల సెన్సార్లతో ట్రిపుల్‌ కెమెరాలను, ఫ్రంట్ 12 మెగాపిక్సల్‌ కెమెరాను అమర్చారు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీని.. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

టైప్‌-సీ పోర్ట్‌, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్‌ 5.0, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ సహా అన్ని సెన్సార్లు ఉన్నాయి. ఇందులోని 3,500 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ 10 వాట్ల ఫాస్ట్‌ఛార్జింగ్‌కు మద్దతుగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా గత వారం విడుదలైన వివిధ దేశాల్లో దాదాపు రూ.20వేలుగా నిర్ణయించింది. భారత్‌కొచ్చే సరికి ఇతర కంపెనీల నుంచి ఉన్న పోటీ దృష్ట్యా ధరను తగ్గించినట్లు తెలుస్తోంది.

click me!