కృత్రిమ మేధ హువాయి లక్ష్యం: 140 మిలియన్ల డాలర్ల పెట్టుబడి

By Arun Kumar PFirst Published Oct 13, 2018, 11:57 AM IST
Highlights

చైనా టెక్నాలజీ మేజర్ హువాయి కృత్రిమ మేధస్సును డెవలప్ చేసేందుకు.. భాగస్వామ్య పక్షాలతో తన అనుబంధం బలోపేతానికి సిద్ధమైంది. ఇందుకోసం 140 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 

పర్యావరణ హితంతో చౌకగా, విశ్వసనీయంగా, నమ్మకమైన సమగ్ర కృత్రిమ మేధస్సు (ఏఐ) నిర్మాణం కోసం భాగస్వామ్య పక్షాలతో కలిసి పని చేసేందుకు చైనీస్ టెక్నాలజీ జయంట్ హువాయి సిద్ధమైంది. ఇందుకోసం 140 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. కృత్రిమ మేధస్సు డెవలపర్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రాం కింద ‘ఏఐ’ టాలెంట్ ఎడ్యుకేషన్ కోసం ఈ పెట్టుబడులను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. 

ఈ ప్రోగ్రామ్ డెవలపర్లు, పార్టనర్లు, యూనివర్సిటీలు, అధ్యయన సంస్థలతో సహకారం పెంపొందించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుందని భావిస్తున్నారు. హువాయి ఉపాధ్యక్షుడు, హువాయి క్లౌడ్ బీయూ అధ్యక్షుడు జెంగ్ యెలాయి గతవారం ఐసీటీ పరిశ్రమ విషయమై ఏర్పాటు చేసిన హువాయి కనెక్ట్ 2018 గ్లోబల్ ఈవెంట్ చివరి రోజు మాట్లాడుతూ టెక్నికల్ కమ్యూనికేషన్, టాలెంట్ ట్రైనింగ్, ఇన్నోవేషన్ టు డెవలపర్స్, ట్యూటర్లు, హువాయి భాగస్వాములకు వేదిక కల్పించేందుకు హువాయి కృత్రిమ మేధస్సు డెవలపర్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రాం ఆఫర్ అందజేస్తోందన్నారు. 

డెవలపర్లకు ఈ ప్రోగ్రామ్ 20 గంటల పాటు ఫ్రీ ఇంట్రడక్టరీ ట్రైనింగ్, ట్రీ వీక్ బిగినర్ ఏఐ ట్రైనింగ్ క్యాంప్, ఏఐ డెవలపర్ కంటెస్ట్‌లతోపాటు కమర్షియల్ అప్లికేషన్స్‌ దిశగా హువాయి పరివర్తన సాధన కోసం రీసెర్చ్, అభివ్రుద్ధి రంగం విజయం సాధించడానికి అత్యుత్తమ టాలెంట్ చూపిన వారికి ఇన్నోవేషన్ ఇంక్యూబేషన్ క్యాంప్ నిర్వహిస్తుంది. 

బహుళ సంస్థలకు ఏఐ అప్లికేషన్స్‌ను ప్రమోట్ చేసేందుకు హువాయి ఏఐ కంప్యూటింగ్ ప్లాట్ ఫామ్, డెవలప్మెంట్ ప్లాట్ ఫామ్ మార్గసూచిగా నిలుస్తుందని జెంగ్ యెలాయి తెలిపారు. దీని ఆధారంగా జాయింట్ సొల్యూషన్స్ తయారు చేసేందుకు వెసులుబాటు లభిస్తుంది. జాయింట్ ఇన్నోవేషన్ హబ్ నిర్మాణం, డెవలప్మెంట్ మాడ్యూల్స్ 1000 సెట్ల ఫ్రీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అందజేసేందుకు వీలు చిక్కుతుంది. 

ఈ వేదిక ద్వారా హువాయి సంస్థ తొలి 20 భాగస్వాములకు ఎక్స్‌పర్ట్ రీసోర్సెస్, జాయింట్ సొల్యూషన్స్‌కు మద్దతు కల్పించనున్నది. యూనివర్సిటీలు, అధ్యయన సంస్థల్లో క్రుత్రిమ మేధస్సు కాలేజీలు, సంస్థల, క్రుత్రిమ మేధస్సు లాబోరేటరీల నిర్మాణానికి చేయూతనిస్తుంది. ప్రస్తుతం చైనాలో ఎనిమిది యూనివర్శిటీల పరిధిలో ఏఐ టాలెంట్ డెవలప్మెంట్ కోర్సులను ప్రారంభించింది. వాటిలో ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ ఆఫ్ షింగువా యూనివర్సిటీ, ది యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా, జిజియాంగ్ యూనివర్శిటీ, షాంఘై జియావో టాంగ్ యూనివర్శిటీ, నాంజింగ్ యూనివర్శిటీ, సౌత్ఈస్ట్ యూనివర్శిటీ, జిడియాన్ యూనివర్శిటీ, ఇనిస్ట్యూట్ ఆఫ్ అకౌస్టిక్స్ ఆఫ్ ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లకు హువాయి చేయూతనిస్తోంది. 

అంతేకాదు విసిస్టమ్, గొసున్సన్, ఐలిమింటెల్, విన్నర్ టెక్నాలజీ, సెన్స్ టైం, సీమ్మొ, యితు టెక్, యిసా, ఎక్సోర్ టెక్నాలజీస్, క్లౌడ్ వాక్, ఇంటెలిఫ్యూజన్ తదితర సంస్థలు హువాయి ఏఐ డెవలపర్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. 

click me!