ఇన్‌స్టాగ్రామ్ అధిపతిగా ఆడం మొస్సెరీ

By Arun Kumar PFirst Published Oct 2, 2018, 1:29 PM IST
Highlights

ఇన్‌స్టాగ్రామ్ అధిపతిగా ఆడం మొస్సెరీ

సోషల్ మీడియా ఫేస్‌బుక్ ఫొటో షేరింగ్ వేదిక ఇన్‌స్టాగ్రామ్ అధిపతిగా ఆడం మొస్సెరీ నియమితులయ్యారు. ఇంతకుముందు ఇన్‌స్టా గ్రామ్‌లో ప్రొడక్ట్ విభాగం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. గత నెలలో అర్ధంతరంగా తమ పదవులకు రాజీనామా చేసిన ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులు కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రైగర్‌ల స్థానాలను భర్తీ చేయనున్నారు. 

ఆడం మొస్సెరీ ఒక డిజైనర్ గా తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత సొంతంగా ఒక కన్సల్టెన్సీని డిజైన్ చేశారు. తర్వాత 2008 ఫేస్ బుక్ డిజైన్ టీంలో చేరిపోయారు. తర్వాతీ క్రమంలో డిజైన్ విభాగం నుంచి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగానికి మారిపోయారు. తదుపరి మొబైల్.. న్యూస్ ఫీడ్ వేదికలపై పని చేశారు. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌కు మారిపోయారు ఆడం మొస్సెరీ.

ఇన్‌స్టాగ్రాం అధినేతగా ఆడం మొస్సెరీ సంస్థ బిజినెస్ లావాదేవీలన్నీ పర్యవేక్షిస్తారు. ఇంజినీరింగ్ హెడ్, హెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్‌తోపాటు నూతన ఎగ్జిక్యూటివ్ టీం నియామకం వరకు అన్ని బాధ్యతలు ఆయన చూసుకుంటారు. 

సమీప భవష్యత్‌లో ఇన్‌స్టాగ్రామ్ మంచి పురోగతి సాధిస్తుందని భావిస్తున్నట్లు సహ వ్యవస్థాపకులు కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రైగర్ తెలిపారు. మున్ముందు ఇన్‌స్టాగ్రామ్ ట్రాన్సిషన్‌లో అడుగు పెడుతుందని భావిస్తున్నామన్నారు. ఇద్దరు యూజర్ల నుంచి వంద కోట్ల మందికి చేరుకున్నదని సహ వ్యవస్థాపకులు కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రైగర్ పేర్కొన్నారు.

2010లో స్థాపించిన ఇన్‌స్టాగ్రామ్ సంస్థను 2012లో 100 కోట్ల డాలర్లకు ఫేస్ బుక్ స్వాధీనం చేసుకున్నది. మా ప్రయాణం 13 మందితో మొదలై వేల మంది సిబ్బంది స్థాయికి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని సహ వ్యవస్థాపకులు కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రైగర్ తెలిపారు. 

ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నదన్న, సినిస్టర్ ప్రచారం చేస్తున్నదన్న విమర్శలతో ఫేస్‌బుక్ పలు సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇన్ స్టాగ్రామ్ వ్యవస్థాపకులు కెవిన్ సిస్టోమ్, మైక్ కైగర్ రాజీనామాచేశారు. సంస్థ భవిష్యత్ లో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది ఇన్ స్టాగ్రామ్. డిజైన్ ప్రొడక్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒక ప్రొడక్ట్ లీడర్ ఆడం మొస్సేరికి ఇన్షాగ్రామ్ బాధ్యతలు అప్పగించడంతో తాము థ్రిల్ అయ్యమని కెవిన్ సిస్ట్రోమ్, మైక్ కైగర్ తెలిపారు. 

click me!