అమేజాన్ మరో ఫెస్టివల్ సేల్.. అదిరిపోయే ఆఫర్లు

By ramya neerukondaFirst Published Oct 4, 2018, 10:30 AM IST
Highlights

తొమ్మిదో తేదీ అర్ధరాత్రి 12 తర్వాత నుంచి అందరు కస్టమర్లకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ మరోసారి ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కి తెర లేపింది.

ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది. ఈ మెగా ఆఫర్ ప్రైమ్ మెంబర్లకు  12గంటలు ముందుగానే వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే ప్రైమ్ సభ్యులు ఈనెల 9న మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రైమ్‌ సభ్యులకు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఆఫర్లకు యాక్సెస్‌ లభించనుందని అమెజాన్‌ ప్రకటించింది. తొమ్మిదో తేదీ అర్ధరాత్రి 12 తర్వాత నుంచి అందరు కస్టమర్లకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులపై భారీ తగ్గింపు ప్రకటించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏయే వస్తువుపై ఎంత మేర ఆఫర్ లభిస్తుందో త్వరలోనే అమేజాన్ ప్రకటించనుంది. 

click me!