
ఇటీవల వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన పివి సింధు తిరుమలకు చేరుకున్నారు. గురువారం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న సింధు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామును స్వామివారిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి మరీ ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ కు శ్రీవారి దర్శనాన్ని చేయించారు. సింధు కుటుంబం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో సింధు అర్చకుల ఆశీర్వాదాన్ని పొందారు. అలాగే టిటిడి అధికారులు ఆమెకు పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులు, చాముండేశ్వరినాథ్ లు శ్రీవారిని దర్శించుకున్నారు.
నిన్న రాత్రే తిరుమలకు చేరుకున్న సింధుకు టిటిడి అధికారులు స్వాగతం పలికారు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంఫియన్‌షిప్ లో మొదటి గోల్ట్ మెడల్ సాధించిన ఆమెను వారు అభినందించారు. ఇలా రాత్రే తిరుచానూరు అమ్మవారితో పాటు అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామిని వీరు దర్శించుకున్నారు. ఈ తర్వాతజీఎంఆర్ అతిథి గృహంలో బస చేశారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. సింధు 21-7, 21-7 పాయింట్లతో ఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగిసింది. ఇలా సింధు ఫైనల్ విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ గోల్డ్ మెడల్ కేవలం సింధుకు మాత్రమే కాదు భారత దేశానికి కూడా మొదటి మెడల్ కావడం విశేషం.
సంబంధిత వార్తలు
వరల్డ్ ఛాంపియన్ పివి సింధుకు ప్రత్యేక బహుమతి...ప్రకటించిన చాముండేశ్వరీనాథ్
అలా ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం: పివి సింధు సీరియస్
చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం
2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు