సింధు కన్నాఒక్కరోజు ముందే ఈమె వరల్డ్ ఛాంపియన్

By telugu teamFirst Published Aug 29, 2019, 10:48 AM IST
Highlights

2011లో ముంబయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి జోషి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమె కాలు ఎముకలు విరిగిపోయాయి. ఎడమకాలు పూర్తిగా తెగి పడిపోయింది. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సుమారు 10గంటలపాటు ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. దేశ వ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే... సింధులాగే దేశానికి పేరు తీసుకువచ్చిన మరో క్రీడాకారిణిని మాత్రం ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. సింధూకన్నా ఒక రోజు ముందే ఆమె వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. అయినా... ఆమెను ఎవరూ గుర్తించలేకపోయారు. కనీసం ఒక్క ప్రశంస కూడా ఆమెకు దక్కలేదు. ఆమే మానసి జోషి.

ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ మానసి. పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించిన రోజుకంటే ఒక రోజు ముందే ఆమె ఈ ఘనత సాధించింది. ఒక కాలు కోల్పోయిన మానసి కృత్రిమ కాలుతోనే  పట్టుదలతో శ్రమించి.. బంగారు పతకాన్ని సాధించింది.

2011లో ముంబయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి జోషి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమె కాలు ఎముకలు విరిగిపోయాయి. ఎడమకాలు పూర్తిగా తెగి పడిపోయింది. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సుమారు 10గంటలపాటు ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.

అయితే గ్యాంగ్లిన్ అనే వ్యాధి సోకడంతో ఆమె కాలును తొలగించారు. ఆ విషయం తెలిసిన తర్వాత మానసి.. నాలుగు గోడలకే పరిమితం కావాలని అనుకోలేదు. ప్రమాదం జరిగిన ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడిచింది. పట్టుదలతో బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగింది. స్కోబా డైవింగ్‌లో కూడా మెలకువలు నేర్చుకుంది. 2014లో పారా ఏషియన్ గేమ్స్‌తో అంతర్జాతీయ క్రీడల్లోకి ప్రవేశించింది. ఛాంపియన్‌గా ఎదిగి యువతకి స్ఫూర్తిగా నిలిచింది. అదే ఆత్మవిశ్వాసంతో ఆటను కొనసాగించింది. పారా బ్యాడ్మింటన్ గోల్డ్ ఛాంపియన్ షిప్‌‌లో స్వర్ణాన్ని అందుకుంది. 

వరల్డ్ ఛాంపియన్ పివి సింధుకు ప్రత్యేక బహుమతి...ప్రకటించిన చాముండేశ్వరీనాథ్‌

అలా ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం: పివి సింధు సీరియస్

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు

 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు

click me!