అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్ గా కోహ్లీ

By telugu teamFirst Published May 14, 2019, 4:56 PM IST
Highlights

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్ గా కోహ్లీ ఎన్నికయ్యారు. 

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్ గా కోహ్లీ ఎన్నికయ్యారు. సియట్ సంస్థ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయి అవార్డులను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. కాగా... ఈ ఏడాది.. ఆ జాబితాలో కోహ్లీకి చోటు దక్కింది.

అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్, అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా కోహ్లీని, అంతర్జాతీయ అత్యుత్తమ బౌలర్ గా బుమ్రాని ఎంపిక చేశారు. ఈ మేరకు వారికి అవార్డులు కూడా అందజేశారు. వీరితో పాటు.. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం మొయిందర్ అమర్‌నాథ్ జీవితసాఫల్య పురస్కారం లభించింది. తనకు అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అమర్‌నాథ్ తెలిపారు.
 
ఇక చతేశ్వర్ పుజారాగాకు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా, రోహిత్ శర్మకు వన్డే క్రికెటర్‌ ఆఫ్ ద ఇయర్‌గా అవార్డులు లభించాయి. ఇక మహిళలలో స్మృతి మంధనకు వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ‘‘2018-19లో క్రికెట్ చాలా అభివృద్ధి చెందింది. ప్రపంచస్థాయిలో క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు’’ అని ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గొనేకా అన్నారు. 

click me!