ఆసీస్ కెప్టెన్సీకి టిమ్ పైన్ రాజీనామా.. మహిళకు అసభ్య సందేశాల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం..

By AN TeluguFirst Published Nov 19, 2021, 11:14 AM IST
Highlights

మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపిన నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు సారథి టిమ్ పైన్ టీం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.  2017 లో  ఓ మహిళకు అతడు అసభ్యకర రీతిలో తన ఫోటో తో సహా  పలు మెసేజ్లు పంపాడని  ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణలో తేలింది. 

మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపిన నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు సారథి టిమ్ పైన్ టీం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.  2017 లో  ఓ మహిళకు అతడు అసభ్యకర రీతిలో తన ఫోటో తో సహా  పలు మెసేజ్లు పంపాడని  ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే Tim Pine తాను  ఆసిస్ టెస్టు  కెప్టెన్ గా ఉండేందుకు అనర్హుని అని పేర్కొంటూ శుక్రవారం  మీడియా ముందుకు వచ్చాడు.  

Tim Pine మాట్లాడుతూ.. ఇది కష్టతరమైన నిర్ణయమే అయినా..  తనకూ, తన కుటుంబంతో  పాటు  ఆస్ట్రేలియా క్రికెట్ కు మంచిదని తెలిపాడు.  కాగా,  2018లో అప్పటి సారథి Steve Smith.. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని  నిషేధానికి గురైన విపత్కర పరిస్థితుల్లో ఫైన్ ఆసిస్ టెస్టు పగ్గాలు అందుకున్నాడు.

ఈ క్రమంలోనే మూడేళ్లు  కెప్టెన్ గా కొనసాగి చివరికి ఇలా రాజీనామా చేశాడు. అయితే వచ్చే నెల 8 నుంచి ఇంగ్లాండ్తో ఆస్ట్రేలియా టీం ఎంతో  ప్రతిష్ఠాత్మకమైన  Ashes series ఆడనుంది.  ఈ మెగా టోర్నీకి ముందు  ఫైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆ జట్టు పై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా, అయిదు వన్డే ప్రపంచకప్పులు, టెస్టు క్రికెట్ లో ఆధిపత్యాలు,  అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ప్రపంచకప్ ను అందుకున్నా సగటు ఆస్ట్రేలియా అభిమాని ధ్యాసంతా యాషెస్ మీదే ఉంటుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో ఆడాలని కోరుకోని ఆసీస్ ఆటగాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. 

Ashes: ఇంగ్లాండ్ తో ‘బూడిద’ పోరులో ఆస్ట్రేలియా దళమిదే.. తొలి టీ20 ప్రపంచకప్ అందించిన హీరోలకు మొండిచేయి..

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ఆటగాళ్లు పోరాడే ఈ సిరీస్  2021 డిసెంబర్ 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. అయితే ముందుగా టిమ్ పైన్ కెప్టెన్ గా వ్యవహరించనున్న  కంగారూ సేనలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. అయితే ఇప్పుడు టిమ్ పైన్ రాజీనామా చేయడంతో ఈ జట్టు పగ్గాలు ఎవరికి అందనున్నయో వేచి చూడాలి.  

ఇంతకీ  యాషెస్ కు ఆ పేరు ఎలా వచ్చింది..? 

‘ప్రతి రెండేండ్ల కోసం ఆసీస్-ఇంగ్లాండ్ బూడిద కోసం కొట్టుకుంటాయి’ అని  పత్రికలలో కథనాలు చూసే ఉంటారు. అసలు  ఈ సిరీస్ కు ఆ పేరెలా వచ్చిందంటే.. 1882లో ఓవల్ స్టేడియంలో జరిగిన  ఓ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లీష్ జట్టు  అనూహ్యంగా ఓడింది. ఇంగ్లాండ్ పై ఆసీస్ కు ఇదే మొదటి విజయం. 

దీంతో ఓ ఆంగ్ల పత్రిక.. ఇంగ్లాండ్  క్రికెట్ చచ్చిపోయిందనే ఉద్దేశంతో ‘అంత్యక్రియలు జరుపగా వచ్చిన బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకెళ్తారు..’ అని ఓ సంచలనాత్మక కథనాన్ని రాసింది.  ఇక 1883లో England ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు పలు ఇంగ్లీష్ పేపర్లు.. ‘యాషెస్ ను తిరిగి తీసుకురండి..’ అని రాశాయి. అప్పట్నుంచి ఆసీస్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు ‘ది యాషెస్’ అనే పేరు స్థిరపడిపోయింది. 

click me!