నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ ఇదే.. కోహ్లీ

By ramya neerukondaFirst Published Jan 7, 2019, 12:35 PM IST
Highlights

తన జీవితంలో బిగ్గెస్ట్  అచీవ్ మెంట్ ఇదే అంటున్నారు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

తన జీవితంలో బిగ్గెస్ట్  అచీవ్ మెంట్ ఇదే అంటున్నారు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.  ఆస్ట్రేలియా పై 2-1 తేడాతో  కోహ్లీ సేన చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. చివరిదైన నాలుగో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో 2-1 తేడాతో ఈ సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. కాగా.. ఈ విజయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.

‘‘ఇప్పటి వరకు నా జీవితంలో ఇదే గొప్ప విజయం. గత 12నెలలుగా జట్టులో ఈ గెలుపు కోసం ప్రయత్నించాం. ప్రపంచ కప్ గెలిచినప్పుడు.. జట్టులో నేను యంగ్ ప్లేయర్ ని. అప్పుడు మిగిలిన ప్లేయర్స్ అంతా కప్ గెలిచినందుకు ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ సిరిస్ మా టీం కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చింది. ఈ గెలుపు చాలా గర్వంగా ఉంది’’ అని కోహ్లీ పేర్కొన్నారు.

Latest Videos

‘‘ నాలుగేళ్ల క్రితం ఇక్కడే నేను కెప్టెన్ బాధ్యతలు చేపట్టాను. నేను చాలా గర్వంగా ఫీలౌతున్నాను. ఈ మూమెంట్ ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను’’ అని కోహ్లీ చెప్పారు.  అనంతరం ఈ మ్యాచ్ లో అత్యంత ప్రతిభ కనపరిచన పుజారా, మయాంక్ లపై కోహ్లీ పొగడ్తల వర్షం కురిపించారు.

ఈ సిరీస్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన‌ పుజారాకు ధ‌న్య‌వాదాలు. ఎలాంటి క్లిష్ట‌మైన స‌వాళ్ల‌నైనా ఎదుర్కోవ‌డానికి పుజారా ముందుంటాడు. అలాగే మాయంక్, పంత్‌ కూడా అద్భుతంగా రాణించారు. అలాగే బౌలింగ్ విభాగం కూడా గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై స‌త్తా చాటింద‌`ని కోహ్లీ చెప్పాడు.

read more news

72 ఏళ్ల నిరీక్షణ తర్వాత...భారత్‌‌కు దక్కిన ఆ విజయం

సిడ్నీ టెస్ట్: మ్యాచ్ డ్రా, ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్

సిడ్నీ టెస్ట్: ముగిసిన నాలుగోరోజు ఆట.. 322 పరుగుల వెనుకబడ్డ ఆసీస్

మరీ ఇంతటి పతనమా...30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్

సిడ్నీ టెస్టు: రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా

‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

కేఎల్ రాహుల్ నిజాయితి... అంపైర్ ప్రశంసలు

సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

click me!