ఐపీఎల్ లో సురేష్ రైనా మరో రికార్డ్

By telugu teamFirst Published May 2, 2019, 2:52 PM IST
Highlights

చెన్నై సూపర్ కింగ్స్  ఆటగాడు సురేష్ రైనా తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో 5వేల పరుగులు చేసిన సురేష్ రైనా... మిస్టర్ ఐపీఎల్ బిరుదు కొట్టేసిన సంగతి తెలిసిందే. 

చెన్నై సూపర్ కింగ్స్  ఆటగాడు సురేష్ రైనా తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నారు. ఇప్పటికే ఐపీఎల్ లో 5వేల పరుగులు చేసిన సురేష్ రైనా... మిస్టర్ ఐపీఎల్ బిరుదు కొట్టేసిన సంగతి తెలిసిందే. తాాజగా... ఐపీఎల్ చరిత్రలో వంద క్యాచ్ లు పట్టిన తొలి ఫీల్డర్ గా రికార్డుకి ఎక్కాడు..  ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రైనా ఈ రికార్డు సాధించాడు.

ఐపీఎల్ చరిత్రలో అన్ని క్యాచ్ లు పట్టిన తొలి ఆటగాడుగా రైనా నిలిచాడు. రైనా తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ 84, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ 82 క్యాచ్‌లు అందుకున్నారు. వికెట్ కీపర్ల విషయానికొస్తే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మాత్రమే 100 క్యాచ్‌లు అందుకున్నాడు. 

సురేశ్‌ రైనా మొదట్నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకే ఆడుతున్నాడు. చెన్నై జట్టు నిషేధం ఎదుర్కొన్న సమయంలో గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ లో  చోటు దక్కించుకొని ఈ ఐపీఎల్ లో చెలరేగిపోతున్నాడు.

click me!