పేరేమో‘‘ బోర్డర్-గావస్కర్’’ ట్రోఫీ.. గావస్కర్‌ను పిలవని ఆసీస్ బోర్డ్

By sivanagaprasad kodatiFirst Published Jan 2, 2019, 2:13 PM IST
Highlights

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ను అవమానించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా త్వరలో జరగనున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం పంపలేదు. 

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ను అవమానించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా త్వరలో జరగనున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం పంపలేదు.

1996 నుంచి జరుగుతున్న ఈ సిరీస్‌ విజేతకు క్రికెట్ దిగ్గజాలు అలెన్ బోర్డర్, సునీల్ గావస్కర్‌లు సంయుక్తంగా ట్రోఫీని ప్రధానం చేస్తూ వచ్చారు. ఈ సారి ఆస్ట్రేలియా వేదికగా జరిగే ట్రోఫీ బహుకరణకు గావస్కర్‌కు ముందస్తు సమాచారం లేకపోవడంతో బోర్డర్ ఒక్కరే హాజరుకానున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా కమ్యూనికేషన్ హెడ్ టిమ్ విటకెర్ మాట్లాడుతూ.. ట్రోఫీ ప్రదానోత్సవానికి రావాల్సిందిగా జూన్, ఆగస్టులలో గావస్కర్‌కు ఆహ్వానాలు పంపామని చెప్పారు.  

అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపాల్సిందిగా మీడియా ప్రశ్నించగా.. అధికారిక ఆహ్వానాలు బయటకు పంపరాదంటూ బదులిచ్చారు. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో 2015లో, 2007-08లో ఇలానే వ్యవహరించింది. 

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ

కెప్టెన్‌గా గంగూలీ సరసన కోహ్లీ

అతని బౌలింగ్‌ అంటే భయం.. నేను ఆడలేను: కోహ్లీ

click me!