కుర్చీపైకెత్తి, మేరీకోమ్ ను దూషించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్

By telugu teamFirst Published Dec 29, 2019, 12:36 PM IST
Highlights

నిన్న ఢిల్లీలో జరిగిన ఒలింపిక్ బెర్త్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి  హల్చల్ చేసాడు. యువ బాక్సర్ నిఖత్ జరీన్, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మరీని విజేతగా ప్రకటించగానే... కోపంతో ఊగిపోతూ తాను కూర్చున్న కుర్చీ పైకి ఎత్తి రచ్చ రచ్చ చేసాడు. 

న్యూ ఢిల్లీ: నిన్న ఢిల్లీలో జరిగిన ఒలింపిక్ బెర్త్ క్వాలిఫయర్స్ మ్యాచ్ లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి  హల్చల్ చేసాడు. యువ బాక్సర్ నిఖత్ జరీన్, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మరీని విజేతగా ప్రకటించగానే... కోపంతో ఊగిపోతూ తాను కూర్చున్న కుర్చీ పైకి ఎత్తి రచ్చ రచ్చ చేసాడు. 

మిగిలినవారంతా ఒక గ్యాంగ్ లా మారి మంచు విజేతను ప్రకటించడంలో గూడుపుఠాణి చేసారని వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు. నిన్నటి మ్యాచులో అసలు జరీన్ ను విజేతగా ప్రకటించాలని...రెండవ రౌండ్ లో ఆమె మేరీకోమ్ ని కింద కూడా పడేసిందని, ఒక క్రీడాకారుడిగా ఎవరు విజేతో కాదో తనకు ఆ మాత్రం అంచనా వేయడం వచ్చని వెంకటేశ్వరా రెడ్డి అభిప్రాయపడ్డాడు. తాను కుర్చీ ఎత్తిన మాట వాస్తవమే అని, కానీ ఎవ్వరినీ దూషించలేదని అన్నాడు. 

Also read: క్రీడాస్ఫూర్తికి విఘాతం: మేరీ కోమ్ ప్రవర్తనపై అభిమానుల ఆగ్రహం

ఫలితాన్ని ప్రకటిస్తుండగా బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అజయ్ ని ఈ పరిణామం ఏంటి అని ప్రశ్నించానని చెప్పుకొచ్చాడు. దానికి అజయ్ సింగ్ మాట్లాడుతూ..జరీన్ కి ఇంకా టైం ఉంది అని విస్తుపోయే సమాధానం ఇచ్చాడు.

కానీ ఇలా ఎంతకాలం వారు మేరీ కోమ్ తోనే ఆడిస్తారు. కోమ్ వయసు 36 సంవత్సరాలని, జరీన్ కు 23 సంవత్సరాలని, ఇలా వర్ధమాన క్రీడాకారులకు అన్యాయం చేస్తే బాక్సింగ్ ఆటకే చెడ్డ రోజులు దాపరిస్తాయని వెంకటేశ్వరా రెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే సీనియర్ బాక్సింగ్ మహిళల టీం కోచ్ చోటే లాల్ యాదవ్ వెంకటేశ్వరా రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేసాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుండి కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడని, ప్రపంచ ఛాంపియన్, రాజ్యసభ ఎంపీ అయినా మేరీకోమ్ లాంటి వ్యక్తిపట్ల అలా అసభ్యంగా మాట్లాడం తగదని, అందుకు తనకు చాలా కోపం వచ్చినట్టు చోటే లాల్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. 

అక్కడితో ఆగకుండా మ్యాచ్ అయిపోయాక మరోమారు దూషణలకు పాల్పడ్డాడని, విజేతను ప్రకటించాక కుర్చీ ఎత్తి కోపంతో ఊగిపోయాడని చోటే లాల్ యాదవ్ స్పష్టం చేసాడు. భారతదేశం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన మేరీకోమ్ వంటివాటిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అన్నాడు. వెంకటేశ్వరరెడ్డి లాంటి వ్యక్తులను  క్రీడాప్రాంగణాల్లోకి అనుమతించొద్దని తాను కమిటీని వేడుకుంటున్నట్టు చెప్పాడు. 

click me!