Asianet News TeluguAsianet News Telugu

క్రీడాస్ఫూర్తికి విఘాతం: మేరీ కోమ్ ప్రవర్తనపై అభిమానుల ఆగ్రహం

న్యూఢిల్లీలో మహిళల బాక్సింగ్‌లో చోటుచేసుకుంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌, మహిళా బాక్సింగ్‌ క్వీన్ మేరీకోమ్‌తో వరల్డ్‌ జూనియర్‌ మాజీ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ రింగ్‌లో ఫైట్‌కు దిగింది. దిగ్గజ బాక్సర్‌తో బౌట్‌ కోసం నిఖత్‌ బహిరంగ లేఖలతో నర్సింగ్‌ యాదవ్‌ మాదిరే పోరాటం చేసింది. ఫలితం కూడా సేమ్ టు సేమ్. రెజ్లింగ్‌లో వచ్చినట్టే బాక్సింగ్‌లోనూ పునరావృతం అయ్యింది. ఫలితంతో పాటు మ్యాచ్‌ అనంతర పరిణామాలు సైతం అలానే పునరావృతం కావటం క్రీడాభిమానులను కలిచివేసింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దురదృష్టకరం. 

mary kom vs nikhat zareen: kom refuses to hug her opponent after the bout
Author
New Delhi, First Published Dec 29, 2019, 11:56 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీలోని ఒక సాధారణ బాక్సింగ్ రింగ్. ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ కోసం భారత బాక్సింగ్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. సాధారణంగా బాక్సింగ్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో ముఖ్యమైన బౌట్‌ ఉంటేగానీ గ్యాలరీలో సంఖ్య పెరుగదు, అందునా మహిళల మ్యాచ్ కి అంత ప్రాధాన్యత కనబడదు. 

ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ బెర్త్‌ కోసం జరుగుతున్న ట్రయల్స్‌కు బాక్సింగ్‌ సమాఖ్య అధికారులు మినహా మరొకరు కనిపించరు. మీడియా ఇచ్చే ప్రాధాన్యత సైతం అతి సాధారణం. 

కానీ శనివారం నాటి పరిస్థితి పూర్తిగా డిఫరెంట్.  కుస్తీలో సుశీల్‌ కుమార్‌తో ట్రయల్స్‌పై సమాఖ్యతో పోరాటం చేసిన నర్సింగ్‌యాదవ్‌ ఉదంతం మల్లయుద్ధ అభిమానులకు ఇంకా మనస్సులో మెదుల్తూనే ఉంటుంది. 

అటువంటి పరిస్థితే న్యూఢిల్లీలో మహిళల బాక్సింగ్‌లో చోటుచేసుకుంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌, మహిళా బాక్సింగ్‌ క్వీన్ మేరీకోమ్‌తో వరల్డ్‌ జూనియర్‌ మాజీ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ రింగ్‌లో ఫైట్‌కు దిగింది. 

Also read: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌‌గా కోనేరు హంపి

దిగ్గజ బాక్సర్‌తో బౌట్‌ కోసం నిఖత్‌ బహిరంగ లేఖలతో నర్సింగ్‌ యాదవ్‌ మాదిరే పోరాటం చేసింది. ఫలితం కూడా సేమ్ టు సేమ్. రెజ్లింగ్‌లో వచ్చినట్టే బాక్సింగ్‌లోనూ పునరావృతం అయ్యింది. ఫలితంతో పాటు మ్యాచ్‌ అనంతర పరిణామాలు సైతం అలానే పునరావృతం కావటం క్రీడాభిమానులను కలిచివేసింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దురదృష్టకరం. 

మేరీకోమ్‌ సునాయాస గెలుపు... 

మహిళల 51 కేజీల విభాగంలో ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు నిర్వహించిన ట్రయల్స్‌ ఫైనల్లో 36 ఏండ్ల మేరీకోమ్‌, 23 ఏండ్ల నిఖత్‌ జరీన్‌పై అలవోక విజయం సాధించింది. మేరీకోమ్‌ 9-1తో గెలుపొందింది. మెరుగ్గా పోరాడిన నిఖత్‌ జరీన్‌ దిగ్గజ బాక్సర్‌ ముందు తలొంచక తప్పలేదు. జరీన్ పోరాట పటిమ మాత్రం స్ఫూర్తిదాయకం.  

ఈ విజయంతో ఫిబ్రవరిలో చైనాలో జరుగనున్న ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌ తరఫున 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ ప్రాతినిథ్యం వహించనుంది. ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో మేరీకోమ్‌ విజయం సాధిస్తే ఆమె నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత ససాధిస్తుంది.  ఒకవేళ విఫలమైతే... మేలో రష్యాలో జరుగబోయే వరల్డ్‌ క్వాలిఫయర్స్‌ కోసం మరోసారి నిఖత్‌ జరీన్‌తో ట్రయల్స్‌లో మేరీకోమ్‌ తలపదాలసుంటుంది. 

దిగ్గజ బాక్సర్ కి ఇది తగునా...? 

23 ఏండ్ల యువ తెలంగాణ బాక్సర్‌ సమాన అవకాశాల కోసం ట్రయల్స్‌కు కోరినప్పుడు నిఖత్‌కు చాలామంది మద్దతు పలికారు. అలాగని వారిలో ఎవరూ మేరీకోమ్‌ను తప్పుపట్టలేదు. భారత బాక్సింగ్‌లోనే కాదు వరల్డ్‌ బాక్సింగ్‌లోనూ మేరీకోమ్‌ దిగ్గజం. 

కానీ శనివారం నాటి ట్రయల్స్‌లో ఫైనల్లో గెలుపొందిన మేరీకోమ్‌ తన ప్రవర్తనతో తన స్థాయిని తగ్గించుకుంది. బౌట్‌కు ముందు నిఖత్‌తో కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడని మేరీకోమ్‌, విజయానంతరం నిఖత్‌ జరీన్‌ ఆలింగం చేసుకునేందుకు రాగా దురుసుగా పక్కకు నెట్టేసింది. 

Also read: కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్: ఈ దశాబ్దం చెత్త ట్వీట్ ఇదే..

ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌, రాజ్యసభ సభ్యురాలిగా మేరీకోమ్‌ హుందాగా వ్యవహరించకపోగా, పరిణితి లేని యువ క్రీడాకారిణి కంటే హీనంగా ప్రవర్తించటం చాలా బాధాకరం. ఏ క్రీడలోనైనా మ్యాచ్‌ అనంతరం ప్రత్యర్థులతో ఆత్మీయ కరచాలనం లేదా ఆలింగం క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ఓ యువ క్రీడాకారిణి ఓటమి బాధలో ఉండి ఆలింగనం అడిగితే, నిరాకరించి మేరీకోమ్‌ స్థాయిని తగ్గించుకుంది. తన స్థాయిని తగ్గించుకోవడమే కాకుండా క్రీడా స్ఫూర్తికే విఘాతం కలిగించింది. 

వివాదాన్ని ఎవరు మొదలుపెట్టారు: మేరీకోమ్ 

తనకు ఇదంతా ఇష్టం ఉండదని, నిఖత్‌ అనవసరంగా తన పేరును వివాదంలోకి లాగిందని కోమ్ మ్యాచ్ అనంతరం అనింది. ఆమెను ఆలింగనం చేసుకోలేదు, అందులో పెద్ద విషయం ఏముందని ఎదురు ప్రశ్నించింది. తాను ఇది మొదలెట్టలేదని, ఆమెతో ఫైట్‌ చేయను అని ఎన్నడూ అనలేదని చెప్పుకొచ్చింది.తానూ మానవ మాత్రురాలినేనని,  తనకూ చిరాకు, కోపం వస్తాయని,  నిబద్దత ప్రశ్నార్థకం అయినప్పుడు కోపం రాదా అని వ్యాఖ్యానించింది. 

తన విషయంలో ఇది మొదటిసారి కాదని, భారత బాక్సింగ్‌లో ఎవరూ సాధించని విజయాలు నమోదు చేసినా, వరుసగా ఇటువంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోయింది. రింగ్‌లో రాణించి తన  స్థానం తీసుకోవచ్చని, కానీ ఆ పని చేయకుండా పెద్ద పెద్ద మాటలు వద్దని కోమ్ అభిప్రాయపడింది. 

ఇక ఈ పరిణామంపై స్పందించిన నిఖత్ జరీన్ తాను ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని, రింగ్‌లో  శక్తి సామర్థ్యం మేరకు ఆడానని కానీ... బౌట్‌ అనంతరం మేరీకోమ్‌ ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదని వాపోయింది జరీన్. 

ఓ సీనియర్‌ బాక్సర్‌ నుంచి తన పోరాటానికి ప్రోత్సాహకం లభిస్తుందని ఆశించిందట జరీన్. కానీ, కోమ్ ప్రవర్తనతో ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చింది. బౌట్‌ జరుగుతున్నప్పుడు కూడా రింగ్‌లోనూ అసభ్య పదజాలంతో దూషించిందని జరీన్ ఆవేదన వ్యక్తం చేసింది. నిరూపించుకునేందుకు మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అనింది. 

Follow Us:
Download App:
  • android
  • ios