సైనా నెహ్వాల్ కి వీసా సమస్య... హెల్ప్ చేయాలంటూ రిక్వెస్ట్

By telugu teamFirst Published Oct 9, 2019, 2:30 PM IST
Highlights

వచ్చే వారంలోనే తనకు మ్యాచ్ లు ఉన్నాయని, ఇంతవరకూ వీసా ప్రాసెస్ మొదలు కాలేదని, అధికారులు కల్పించుకోవాలని వ్యాఖ్యానించింది. ఇక సైనా నెహ్వాల్, షటిల్ పోటీలకు వెళ్లేందుకే వీసా కూడా ఇవ్వకపోవడం ఏమిటని... అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ.. సైనా అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతుండటం గమనార్హం. 

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కి వీసా సమస్య తలెత్తింది. దీంతో తనకు సహాయం చేయాలంటూ ఆమె కేంద్ర విదేశాంగ శాఖను కోరుతున్నారు. దేశం తరపున ఎన్నో టోర్నమెంట్లు ఆడి పతకాలు గెలిచిన సైనా కి వీసా ఇవ్వకపోవడం గమనార్హం.

త్వరలో డెన్మార్క్ లో బ్యడ్మింటన్ పోటీలు జరుగుతుండగా... వాటిలో సైనా పాల్గొనాల్సి ఉంది.  నెల 15 నుంచి వారం రోజుల పాటు డెన్మార్క్ లోని ఒడెన్సీలో ఈ పోటీలు జరుగనుండగా, తనకు, తన ట్రయినర్ కు ఇంతవరకూ వీసా రాలేదని సైనా నెహ్వాల్ వాపోయింది. కనీసం వారం రోజులు కూడా గడువు లేదని ఇంత వరకు వీసా ప్రాసెస్ కూడా ప్రారంభించలేదని ఆమె వాపోయారు. 

ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖ, భారత్ లోని డెన్మార్క్ దౌత్య కార్యాలయాలను ట్యాగ్ చేస్తూ, ట్విట్టర్ లో తన సమస్యను ఆమె వివరించారు. తనకు, తన ట్రైనర్ కి  వీసా వచ్చేలా చూడాలని కోరింది. వచ్చే వారంలోనే తనకు మ్యాచ్ లు ఉన్నాయని, ఇంతవరకూ వీసా ప్రాసెస్ మొదలు కాలేదని, అధికారులు కల్పించుకోవాలని వ్యాఖ్యానించింది. ఇక సైనా నెహ్వాల్, షటిల్ పోటీలకు వెళ్లేందుకే వీసా కూడా ఇవ్వకపోవడం ఏమిటని... అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ.. సైనా అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతుండటం గమనార్హం. 

click me!