పివి సింధుకు పద్మభూషణ్...: క్రీడా మంత్రిత్వ శాఖ

By Arun Kumar PFirst Published Sep 12, 2019, 3:58 PM IST
Highlights

తెలుగుతేజం పివి సింధుకు మరో అరుదైన గౌరవంతో సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. ఆమెకు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటయిన పద్బ భూషణ్  కోసం నామినేట్ చేస్తూ క్రీడా మంత్రత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.  

తెలుగు తేజం పివి సింధుకు మరో అరుదైన గౌరవంతో  సత్కరించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సిద్దమయ్యింది. బ్యాడ్మింటన్ వరల్ట్ ఛాంపియన్‌షిప్ లో అదరగొట్టిన సింధు గోల్డ్ మెడల్ సాధించింది. ఇలా అంతర్జాతీయ స్థాయిలో  భారత దేశ గౌరవాన్ని, ప్రతిష్టను పెంచిన ఆమెకు అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ తో సత్కరించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తోంది. 

ఇక మరో మహిళా క్రీడాకారిణి మేరీకోమ్ కు కూడా పద్మ విభూషణ్ అందించాలని  కేంద్రం చూస్తోంది. ఈ మేరకు వారిద్దరి పేర్లను ఆయా పురస్కారాలకు నామినేట్ చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన  విడుదల చేసింది. వీరితో పాటు మరో తొమ్మిదిమంది క్రీడాకారులు ఈ పురస్కారాల కోసం నామినేట్ చేశారు. 

అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో అదరగొట్టిన మేరీకోమ్ ఇప్పటికే ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచారు. దీంతో గతంలోనే ఆమెకు  పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తాజాగా ఆమె ఖాతాలోకి  పద్మవిభూషణ్ చేరనుంది. ఆ అవార్డుకు నామినేట్ అయిన తొలి మహిళా  క్రీడాకారిణిగా మేరీకోమ్ రికార్డు సృష్టించారు. 

ఇక పివి సింధు ఒలింపిక్స్ లో మెడల్ సాధించడం  ద్వారా తన సత్తా  ఏంటో ప్రపంచానికి చూపించారు. అయితే ఆ తర్వాత ఆమె అంతర్జాతీయ స్థాయి  విజయాలేమీ అందుకోలేకపోయారు. తాజాగా వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సత్తాచాటి బంగారు పతకాన్ని సాంధించారు. ఇలా భారత్  తరపున బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో మొదటి గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిగా కూడా సింధు చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెకు యావత్ దేశ ప్రజలు అభినందనలు తెలియజేశారు. 
 

click me!