పుజారా రికార్డు: దిగ్గజాల జాబితాలో చోటు

By sivanagaprasad kodatiFirst Published Jan 3, 2019, 1:33 PM IST
Highlights

టీమిండియా టెస్టు జట్టులో ఆపద్భాందవుడిలా మారిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర పుజారా భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. క్రీజులో నిలదొక్కుకుంటూ వికెట్ల పతనానికి అడ్డుగోడలా నిలుస్తున్నాడు. 

టీమిండియా టెస్టు జట్టులో ఆపద్భాందవుడిలా మారిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర పుజారా భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. క్రీజులో నిలదొక్కుకుంటూ వికెట్ల పతనానికి అడ్డుగోడలా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు.

తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఒక టెస్ట్ సిరీస్‌లో వెయ్యికి పైగా బంతుల్ని ఎదుర్కొన్న భారత ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతులాడిన పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో వెయ్యి బంతుల్ని ఆడిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు. లిస్ట్‌లో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ 1203 బంతులతో అగ్రస్థానంలో ఉన్నాడు. విజయ్ హాజారే 1192, కోహ్లీ 1093, సునీల్ గావస్కర్ 1032  స్థానాల్లో ఉన్నారు. 
 

సచిన్‌కు క్రికెట్ ఓనమాలు నేర్పిన మాస్టర్ ఇకలేరు...

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ

కెప్టెన్‌గా గంగూలీ సరసన కోహ్లీ

అతని బౌలింగ్‌ అంటే భయం.. నేను ఆడలేను: కోహ్లీ

పేరేమో‘‘ బోర్డర్-గావస్కర్’’ ట్రోఫీ.. గావస్కర్‌ను పిలవని ఆసీస్ బోర్డ్

click me!