మయాంక్ రికార్డుల మోత

By sivanagaprasad kodatiFirst Published Jan 3, 2019, 11:14 AM IST
Highlights

కర్ణాటక పరుగుల యంత్రం మయాంక్ అగర్వాల్ సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దూసుకెళ్తున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మయాంక్ రికార్డుల మోత మోగిస్తున్నాడు.

గత మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సు‌ల్లో 76, 42 పరుగులు చేసి విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసినన రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన మయాంక్.. నాల్గో టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగులు సాధించి మరో రికార్డు నెలకొల్పాడు.

కెరీర్ తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లోనే రెండు అర్ధశతకాలు సాధించిన భారత ఓపెనర్‌గా నిలిచాడు. అంతకు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్, చిచ్చర పిడుగు పృథ్వీషాలు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై కనీసం రెండు అర్థసెంచరీలు సాధించిన ఎనిమిదో భారత ఓపెనర్‌గా ఘనత వహించాడు.

click me!