సచిన్ ముందు, వెనుక స్థానాలు పుజారావే...

By Arun Kumar PFirst Published Jan 3, 2019, 6:13 PM IST
Highlights

బోర్డర్-గవాస్కర్ ట్రోపిలో భాగంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సీరిస్‌లో టీంఇండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా అదరగొడుతున్నాడు. భారత ఆటగాళ్లంతా విఫలమైన సమయంలోనూ తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును ఆదుకుంటూ అద్భుత విజయాలను అందించాడు. ఒకటి తర్వాత మరొకటి ఇలా ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే సెంచరీల మోత  మోగిస్తున్నాడు. 
 

బోర్డర్-గవాస్కర్ ట్రోపిలో భాగంగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సీరిస్‌లో టీంఇండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా అదరగొడుతున్నాడు. భారత ఆటగాళ్లంతా విఫలమైన సమయంలోనూ తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును ఆదుకుంటూ అద్భుత విజయాలను అందించాడు. ఒకటి తర్వాత మరొకటి ఇలా ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే సెంచరీల మోత  మోగిస్తున్నాడు. 

ఈ టెస్ట్ సీరీస్‌లో నిర్ణయాత్మకంగా మారిన సిడ్నీ టెస్ట్ లోనూ తన అద్భుత బ్యాంటింగ్ ప్రదర్శనతో పుజారా మరో సెంచరీ సాధించాడు. అంతేకాకుండా మొదటిరోజు ఆటలో సాధించిన పరుగుల ద్వారా భారతీయ మాజీ లెజెండరీ ఆటగాడు సచిన్ ను వెనక్కి నెట్టి రికార్డు సృష్టించాడు.

సిడ్నీ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పుజారా 130 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. అయితే ఇలా ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ ఆటగాళ్ళ జాబితాలో చేరిపోయాడు. 

మొదటిరోజు ఆటలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో సెహ్వాగ్(195) పరుగులతో మొదటి స్థానంలో వున్నాడు. అతడి తర్వాత మురళీ విజయ్, గవాస్కర్  లు వుండగా తాజా పరుగులతో పుజారా నాలుగో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. అంతకు ముందు నాలుగో స్ధానంలో సచిన్ వుండగా అతన్ని పుజారా వెనక్కి నెట్టాడు. 

ఈ సీరిస్‌లో పుజారా ఓ గమ్మత్తయిన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై మొదటిరోజు సచిన్ అత్యధిక పరుగులు 124 కాగా పుజారావి 130 పరుగులు. అయితే ఈ విషయంలో సచిన్ తర్వాత కూడా మళ్లీ పుజారానే నిలవడం విశేషం. మొదటి టెస్టులో మొదటిరోజే పుజారా 123 పరుగులు సాధించిన విషయం  తెలిసిందే. ఇలా సచిన్ కు ముందూ, వెనక నిలిచి పుజారా అరుదైన ఘనత సాధించాడు. 

మరిన్ని వార్తలు

పుజారా రికార్డు: దిగ్గజాల జాబితాలో చోటు

పింక్ గ్లౌవ్స్, బ్యాట్‌తో బరిలోకి దిగిన కోహ్లీ ...విశేషమేంటబ్బా?

సచిన్‌కు క్రికెట్ ఓనమాలు నేర్పిన మాస్టర్ ఇకలేరు...

సచిన్‌కు క్రికెట్ ఓనమాలు నేర్పిన మాస్టర్ ఇకలేరు...

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత

బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు

వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

ఆరంగేట్ర మ్యాచ్‌లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత

పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన

అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ

కెప్టెన్‌గా గంగూలీ సరసన కోహ్లీ

అతని బౌలింగ్‌ అంటే భయం.. నేను ఆడలేను: కోహ్లీ

పేరేమో‘‘ బోర్డర్-గావస్కర్’’ ట్రోఫీ.. గావస్కర్‌ను పిలవని ఆసీస్ బోర్డ్

click me!