ఆర్మీ క్యాప్ తో టీం ఇండియా.. వ్యతిరేకించిన పాక్

By ramya NFirst Published Mar 9, 2019, 11:39 AM IST
Highlights

రాంచీ వేధికగా.. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా ఆర్మీ క్యాప్ లను ధరించిన సంగతి తెలిసిందే.

రాంచీ వేధికగా.. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా ఆర్మీ క్యాప్ లను ధరించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా టీం ఇండియా ఈ క్యాప్ లను ధరించింది.

హోదాలో ఉన్న టీమిండియా కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. మ్యాచ్‌కు ముందు తన సహచరులకు బీసీసీఐ లోగోలతో ఉన్న ఈ ప్రత్యేక క్యాప్‌లను అందించాడు. దీంతో కోహ్లీసేన వీటిని ధరించే మ్యాచ్ ఆడింది. అంతేకాదు, మూడో వన్డేలో తమకు దక్కిన మ్యాచ్‌ ఫీజును కూడా ఆటగాళ్లంతా జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తున్నట్టు కెప్టెన్‌ కోహ్లీ తెలిపాడు.

అయితే.. దీనిపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్మీ క్యాప్ లు ధరించి మ్యాచ్ ఆడటం ఏమిటని ప్రశ్నించింది. ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫావద్ చౌదరి ఈ ఘటనపై మాట్లాడుతూ.. బీసీసీఐపై చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరారు. 

‘‘భారత జట్టు ఆర్మీ క్యాప్‌లు ధ‌రించి క్రికెట్ ఆడ‌డం స‌రికాదు. క్రికెట్‌ను రాజ‌కీయం చేస్తున్న బీసీసీఐపై అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చ‌ర్య‌లు తీసుకోవాలి. టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లు ధ‌రించిన అంశాన్ని పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయాలి’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
 

click me!