దూకుడు మీద భారత్: న్యూజిలాండ్‌ ప్రజలకు పోలీసుల వార్నింగ్

By sivanagaprasad KodatiFirst Published Jan 27, 2019, 2:41 PM IST
Highlights

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే సిరీస్‌లు గెలిచిన భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అదే దూకుడును న్యూజిలాండ్‌లోనూ కొనసాగిస్తూ వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా మరో విజయం సాధించి సిరీస్‌ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది.

ఈ క్రమంలో న్యూజిలాండ్ పోలీసులు సోషల్ మీడియాలో ఒక ఫన్నీ పోస్ట్ పెట్టారు. భారత జట్టును ప్రశంసిస్తూనే ప్రజలకు ఒక సరదా హెచ్చరిక జారీ చేశారు. మనదేశానికి పర్యటన నిమిత్తం ఒక ప్రమాదకరమైన జట్టు వచ్చింది.

అమాయకులైన కివీస్ జట్టు సభ్యులపై ఆ జట్టు రెండు చోట్ల దాడి చేసింది. మీరు క్రికెట్ బంతిగానీ, బ్యాట్ గానీ బయటకు తీసుకెళ్లాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే వారు మీ మీద కూడా దాడి చేస్తారు అంటూ టీమిండియా ఫోటోను షేర్ చేశారు.

న్యూజిలాండ్ పోలీసుల పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నేపియర్, మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ చేతిలో కివీస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మూడో వన్డే సోమవారం మౌంట్ మాంగనుయ్‌లో జరగనుంది. 

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన నేపాల్ కుర్రాడు

ధోనీ మరో స్టన్నింగ్ స్టంపింగ్: ఫ్యాన్స్ ఫిదా

రెండో వన్డే: కుల్దీప్ జోరు, కివీస్ పై భారత్ ఘన విజయం

కుల్దీప్ జాదవ్ జోరు: రెండో బౌలర్ గా ఘనత

ఓపెనింగ్ రికార్డులను బద్దలుగొట్టిన రోహిత్-శిఖర్ జోడీ...

మరో రికార్డ్.. రెండో క్రికెటర్ కోహ్లీ

click me!