సచిన్ రికార్డును బద్దలు కొట్టిన నేపాల్ కుర్రాడు

By pratap reddyFirst Published Jan 27, 2019, 10:18 AM IST
Highlights

యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 ఏళ్ల 146 రోజుల వయసు గల రోహిత్‌ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో సచిన్‌ 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాక్‌పై టెస్టు క్రికెట్‌లో చేసిన ఫిఫ్టీ రికార్డు బద్దలైంది.

దుబాయ్‌: నేపాల్‌ కుర్రాడు రోహిత్‌ పౌడెల్‌ భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. టెండూల్కర్ 29 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును అతను ఇప్పుడు బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. 

యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 ఏళ్ల 146 రోజుల వయసు గల రోహిత్‌ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో సచిన్‌ 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాక్‌పై టెస్టు క్రికెట్‌లో చేసిన ఫిఫ్టీ రికార్డు బద్దలైంది. వన్డే క్రికెట్లో షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్‌) రికార్డును కూడా రోహిత్‌ బద్దలు కొట్టాడు. 

ఆఫ్రిది 16 ఏళ్ల 217 రోజుల వయసులో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇవన్నీ కూడా పురుషుల క్రికెట్‌కే ఈ రికార్డులు పరిమితం. అయితే, మహిళల క్రికెట్‌లో జొమరి లాగ్టెన్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా) 14 ఏళ్ల వయసులోనే టెస్టు, వన్డేల్లో అర్ధసెంచరీలు చేసిన అతిపిన్న క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

  

At the age of just 16 years and 146 days, Nepal's Rohit Paudel today became the youngest man to hit an international half-century, beating the likes of and ! 🇳🇵 🙌

➡️ https://t.co/lRo5UTfuFd pic.twitter.com/qsqZQDYX5y

— ICC (@ICC)
click me!